Jharkhand Shocker: చెల్లిపై అక్క ప్రియుడు దారుణంగా అత్యాచారం, ఆపై హత్య, తోడబుట్టిన అక్కే ప్రధాన నిందితురాలు, జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన
Image used for representational purpose | (Photo Credits: File Image)

Sonar dam, Oct 26: జార్ఖండ్ రాష్ట్రంలో సోనార్ దమ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యభిచారంలోకి (prostitution) రానని చెప్పినందుకు ఓ కిరాతక అక్క సొంత చెల్లిని గుట్టు చప్పుడు కాకుండా ( minor killed for protesting in Sonar dam ) చంపేసింది. పోలీసు అధికారి విజయ్‌, TOI కథనం తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు అక్కాచెల్లెల్లో ఈ బాలిక నాలుగో అమ్మాయి. తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో అక్క రాఖీతో కలిసి ఉంటుంది. తన అక్క రాఖీ వ్యభిచారం నిర్వహిస్తుంది. దీంతో ఆ అమ్మాయిని కూడా వ్యభిచారం చేయాలని ఒత్తిడి (Forced into prostitution by elder sister) చేశారు. ఆ మైనర్ బాలిక ఇష్టానికి విరుద్ధంగా కస్టమర్‌ల వద్దకు పంపేవారు.

అయితే బాలిక ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పగా వారు వ్యతిరేకించారు. అక్క ప్రియులు నిందితులు ప్రతాప్, నితేష్, ధనంజయ్‌లు ముగ్గురు బాలికపై క‌న్నేసి రాఖీ సాయంతో ఆమెపై ప‌లుమార్లు లైంగిక దాడికి య‌త్నించారు. ఈ క్ర‌మంలో రాఖీ ఇంట్లో లేని స‌మ‌యంలో హ‌త్య‌కు రెండ్రోజులు ముందు ఆమె ఇంటికి వ‌చ్చిన ప్ర‌తాప్ ప్లాన్‌ ప్రకారం బాధితురాలిపై అత్యాచారానికి పాల్ప‌డి ఆమెను హ‌త్య చేసి ఆమె శరీరాన్ని ఉరితీశాడు.

దారుణం..పోర్న్ వీడియోలు చూడలేదని బాలికను కిరాతకంగా చంపేసిన ముగ్గురు బాలలు, ఆన్‌లైన్ క్లాసుల కోసం తండ్రి కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని వందల సెక్స్ వీడియోలు, చిత్రాలు

అనంతరం ఈ విష‌యం రాఖీ, రూప, ధ‌నంజ‌య్‌ల‌కు తెలుప‌గా అంద‌రూ క‌లిసి మృత‌దేహాన్ని ఆటోలో నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకువెళ్లి పాతిపెట్టారు. ఈ ఘటన జరిగి దాదాపు ఏడు నెలలు అయింది. ఇప్పుడు తాజాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని సోనార్‌ డ్యాం వద్ద ఝార్ఖండ్‌ పోలీసులు కోర్టు సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. కాగా బాలికను తోడబుట్టిన వారే కడతేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.

మైనర్‌ను ఆమె అక్కలు రాఖీ దేవి(30), రూపా దేవి(25), బావ ధనుంజయ్‌ అగర్వాల్‌(30), రాఖీ లవర్స్‌ ప్రతాప్‌ కుమార్‌, నితిష్‌లు కలిసి హత్య చేసినట్లు తెలిపారు. నిందితుల్లో నితిష్‌ తప్ప మిగతా అందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాంచిలోని రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.