Richest Chief Minister in India: కేసీఆర్ ఆస్తుల విలువ రూ.23.55 కోట్లు, జగన్ ఆస్తులు విలువ రూ.510 కోట్లు, దేశంలో 29 మంది సీఎంలు కోటీశ్వరులే..

దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోట్లకు అధిపతులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ADR ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో రూ.510 కోట్ల విలువైన ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అగ్రస్థానంలో (Rich Chief Minister in India) ఉన్నారు.

Naveen Patnaik

దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోట్లకు అధిపతులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ADR ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో రూ.510 కోట్ల విలువైన ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అగ్రస్థానంలో (Rich Chief Minister in India) ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమాఖండూ (రూ.163కోట్లు), ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (రూ.63కోట్ల) నిలిచారు.

దేశంలో అత్యంత ధనవంతుడైన సీఎంగా జగన్, మూడో స్థానంలో నవీన్ పట్నాయక్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సర్వేలో వెల్లడి

నాలుగవ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.23.55కోట్లు. తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు స్టాలిన్‌, బసవరాజ్‌ బొమ్మైకి రూ.8కోట్ల ఆస్తులున్నాయని పేర్కొంది. బిహార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ రూ.3కోట్లు అని పేర్కొంది. అత్యల్పంగా కేరళ, హర్యానా ముఖ్యమంత్రులు సీఎం పినరయి విజయన్‌, మనోహర్‌ లాల్‌ కట్టర్‌ రూ.కోటికిపైగా ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్‌ నివేదిక (ADR analysis) తెలిపింది.

మనుషుల మధ్య శాశ్వతంగా ఉండిపోనున్న కరోనా, దీనికి అంతం లేదని చెబుతున్న నిపుణులు, జాగ్రత్తలు తీసుకుని వైరస్ ను అడ్డుకోవాలని సూచన

ఈ జాబితాలో అందరికంటే తక్కువగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. మొత్తంగా 30 మంది ముఖ్యమంత్రుల్లో అందరూ కోటీశ్వరులే..వీరిలో 29 రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఉన్నారు.ఇక జమ్మూ కశ్మీర్‌కి ముఖ్యమంత్రి లేని విషయం తెలిసిందే.87శాతం మంది సీఎంలు కోటీశ్వరులేనని.. ప్రతి సీఎంకు సగటు ఆస్తులు రూ.33.96కోట్లు అని ఏడీఆర్‌ పేర్కొంది.

దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా, ఫోర్త్ వేవ్ వచ్చేసిందా, పెరుగుతున్న కేసులతో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో భారత్, మరి నిపుణులు ఏమంటున్నారు ?

ఇదే నివేదికలో ముఖ్యమంత్రుల్లో 13 మంది (43శాతం)పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, బెదిరింపులతో సహా తీవ్రమైన కేసులున్నట్లుగా అఫిడవిట్లలో పేర్కొన్నారని ఏడీఆర్‌ పేర్కొంది. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఐదేళ్లకుపైగా జైలు శిక్షతో కూడిన నాన్ బెయిలబుల్ నేరాలని తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement