IPL Auction 2025 Live

Congress's New Campaign: ఈ నెల 31న బెల్స్‌, డ్రమ్స్‌ మోగించండి, గ్యాస్ సిలిండర్లకు దండలు వేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు, పెట్రో ధరల పెంపుకు నిరసనగా ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 7 వరకు పోరాటం

ఈ మేరకు ఈ నెల 31న ఉదయం పదకొండు గంటలకు ప్రజలు, కాంగ్రెస్ నేతలు తమ ఇళ్ల వద్ద, పబ్లిక్ ప్లేసులలో గ్యాస్ సిలిండర్లకు దండలు వేయడంతో పాటు, డ్రమ్స్, బెల్స్ వంటివి మోగించాలని (Ring Bells, Drums At 11 am This Thursday) సూచించింది.

Congress Flag (Photo Credits: PTI)

New Delhi, Mar 26: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచుతున్నది. ఈ నేపథ్యంలో పెట్రో ధరల పెంపుపై కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్. వరుసగా నాలుగో రోజైన శనివారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 80 పైసల మేర పెరిగాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపునకు (Fuel Price Hike) వ్యతిరేకంగా యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు శనివారం ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 7 వరకు మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్ పేరుతో (Congress's New Campaign) నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా.. శనివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ చేపట్టబోయే కార్యక్రమాల్ని వివరించారు. ఈ మేరకు ఈ నెల 31న ఉదయం పదకొండు గంటలకు ప్రజలు, కాంగ్రెస్ నేతలు తమ ఇళ్ల వద్ద, పబ్లిక్ ప్లేసులలో గ్యాస్ సిలిండర్లకు దండలు వేయడంతో పాటు, డ్రమ్స్, బెల్స్ వంటివి మోగించాలని (Ring Bells, Drums At 11 am This Thursday) సూచించింది. ఈ నిరసనల శబ్దాలైనా బీజేపీ చెవిన పడతాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

అంబులెన్స్ లేక భుజంపై కూతురి శవం మోసుకుంటూ 10 కిలో మీటర్లు నడిచిన తండ్రి, దారుణం...

కోవిడ్ మొదలైన సందర్భంగా ప్రధాని మోదీ అందరూ తమ ఇండ్లవద్ద చప్పట్లు కొట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. అప్పుడు మోదీ అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ప్రధాని నిర్ణయాలకు వ్యతిరేకంగా పాటించబోతుంది. ఇంధన ధరల పెంపుతో ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దాదాపు 26 లక్షల కోట్లు అర్జించిందని కాంగ్రెస్ విమర్శించింది. శనివారం నాటికి కేంద్రం వరుసగా ఐదో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరలు కూడా పెంచింది కేంద్రం. కేంద్రం ప్రజలను పెట్రో ధరల పేరుతో నిస్సిగ్గుగా దోపిడీ చేస్తోందని, దీన్ని ఆపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.