IPL Auction 2025 Live

Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ విశిష్టత తెలుసా?, తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మ ఇవాళ గంగమ్మ ఒడికి, ఊరూరా అంబరాన్నంటనున్న పెద్ద బతుకమ్మ సంబరాలు

మహిళలు వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మను ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఆడిపాడిన తర్వాత స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయనున్నారు.

Saddula Bathukamma 2024 Significance And Rituals Of This Telugu Festival(X)

Hyd, oct 10:  తెలంగాణ పూలపండగ బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. మహిళలు వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మను ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఆడిపాడిన తర్వాత స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయనున్నారు.

మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు సద్దుల బతుకమ్మ( పెద్ద బతుకమ్మ)తో ముగియనున్నాయి. 1వ రోజు – ఎంగిలి పూవు బతుకమ్మ సంబరాల జరుగగా నువ్వులు, బియ్యపు పిండి నైవేధ్యంగా సమర్పించారు.

2వ రోజు – అటుకుల బతుకమ్మ – చప్పిడి పప్పు, బెల్లం , అటుకులు నైవేధ్యంగా,3వ రోజు – ముద్ద పప్పు బతుకమ్మ – ముద్ద పప్పు, పాలు, బెల్లం, 4వ రోజు – నానబియ్యం బతుకమ్మ – నానబెట్టిన బియ్యం, పాలు,బెల్లం,5వ రోజు – అట్ల బతుకమ్మ – అట్లు,6వ రోజు – అలిగిన బతుకమ్మ – నైవేద్యం ఉండదు,7వ రోజు – వేపకాయల బతుకమ్మ – బియ్యపు పిండిని వేపకాయలలాగా చేసి నూనెలో వేయించి సమర్పిస్తారు. 8వ రోజు – వెన్నముద్దల బతుకమ్మ – నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం,9వ రోజు – సద్దుల బతుకమ్మ – పెరుగన్నం, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, కొబ్బరన్నం మరియు నువ్వుల అన్నం నైవేధ్యంగా పెడతారు.   బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించిన అమెరికా, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించిన అమెరికాలోని పలు రాష్ట్రాలు

ఇక ఇవాళ పేర్చే సద్దుల బతుకమ్మకు ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలు అమర్చుకుంటూ ఎత్తైన బతుకమ్మ తయారు చేస్తారు పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మ కూడా పెట్టి పసుపుతో గౌరీ దేవిని చేసి పూజిస్తారు. తొమ్మిదో రోజుతో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి.

సద్దుల బతుకమ్మ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. అమరవీరుల స్థూపం నుండి అప్పర్ ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.