Delhi High Court: పెళ్లికి ముందు సెక్స్ అత్యాచారం కాదు, ఎక్కువ కాలం పాటు ఇద్దరూ కలిసి ఉండి సెక్స్ లో పాల్గొంటే అత్యాచారం కింద పరిగణించలేం, కీలక తీర్పును వెలువరించిన ఢిల్లీ హైకోర్టు

పెళ్లికి ముందు చాలా కాలం పాటు కలిసి ఉండి.. పెళ్లి పేరుతో సెక్స్ చేయడం అత్యాచారం కిందకు రాబోదని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) పేర్కొంది. ఓ యువతి దాఖలు చేసిన కేసుపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పు (Sex on Pretext of Marriage Not Always Rape) చెప్పింది.

Delhi High Court (Photo Credits: IANS)

New Delhi, Dec 17: పెళ్లికి ముందు చాలా కాలం పాటు కలిసి ఉండి.. పెళ్లి పేరుతో సెక్స్ చేయడం అత్యాచారం కిందకు రాబోదని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) పేర్కొంది. ఓ యువతి దాఖలు చేసిన కేసుపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పు (Sex on Pretext of Marriage Not Always Rape) చెప్పింది. నిరవధికంగా లేక సాధారణం కన్నా ఎక్కువ కాలంపాటు ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఉన్నపుడు, పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని సెక్స్ వైపు ఆకర్షించేందుకు (Long-term sexual relation) ప్రోత్సహించడంగా చెప్పలేమని ధర్మాసనం తెలిపింది. కొన్ని కేసుల్లో పెళ్ళి చేసుకుంటాననే వాగ్దానం చేసిన తర్వాత సెక్స్‌‌కు అంగీకరిస్తారని గుర్తు చేసింది. జస్టిస్ విభు భక్రు ధర్మాసనం ఈ సంధర్భంగా గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది.

కొన్ని కేసుల్లో, ఓ పార్టీ సెక్సువల్ రిలేషన్స్‌కు సమ్మతించాలని అనుకోకపోయినప్పటికీ, పెళ్లి చేసుకుంటాననే వాగ్దానం ఆ పార్టీ సెక్సువల్ రిలేషన్స్ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించే విధంగా ప్రలోభపెట్టే అవకాశం ఉంది. సంబంధిత పార్టీ వద్దని చెప్పాలనుకున్నప్పటికీ, అటువంటి ప్రలోభాలు నిర్దిష్ట క్షణంలో సమ్మతిని రాబట్టే అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. కాగా పెళ్లి చేసుకుంటాననే తప్పుడు హామీలకు సంబంధించిన కేసుల్లో ఓ పార్టీ సమ్మతిని బలహీనపరిచే అవకాశం ఉంటుందని, ఆ విధంగా భారత శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారం నేరం అవుతుందని తెలిపింది. సాధారణం కన్నా ఎక్కువ కాలంపాటు అన్యోన్యంగా ఉన్న సందర్భంలో దీనిని అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.

షాకింగ్ న్యూస్..రెండు లక్షలకు పైగా మరణాలు సంభవించవచ్చు, జాగ్రత్తగా ఉండాలని సూచించిన బిల్ గేట్స్, దేశంలో తాజాగా 24,010 మందికి కరోనా

ఓ యువతి నిందితునితో తనకు 2008లో శారీరక సంబంధం ఏర్పడిందని, ఆ వ్యక్తి తనను పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చాడని ఫిర్యాదు దారు ఆరోపించారు. మూడు నెలల తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని ఆ వ్యక్తి హామీ ఇవ్వడంతో తాను ఆయనతో కలిసి వెళ్లానని చెప్పారు. నిందితుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఈ ఆరోపణల నుంచి నిందితునికి హైకోర్టు విముక్తి కల్పించింది. అతనిని నిర్దోషిగా ఢిల్లీ హైకోర్టు విడుదల చేసింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now