Sania Mirza-Shoaib Malik: సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకుల రూమర్స్‌లో మరో ట్వీస్ట్, నేను సూపర్‌ వుమన్‌ సానియామీర్జాకు భర్తను అంటూ బయోలో రాసుకొచ్చిన మాజీ పాక్ క్రికెటర్

సోయబ్‌ తన ఇన్‌స్టా బయోలో ‘నేను సూపర్‌ వుమన్‌ సానియామీర్జాకు భర్తను’ అంటూ పేర్కొన్నాడు. ‘అథ్లెట్‌, సూపర్‌వుమన్‌ సానియామీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోయబ్‌ బయోకు సంబంధించి పిక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Sania Mirza Shoaib Malik Divorce Rumors (Photo-Shoaib Malik Insta)

భార‌త మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దీనిపై షోయబ్ మాలిక్ ఓ ఇంటర్యూలో అది మా వ్యక్తిగ‌త విష‌యం. ఆ విష‌యాన్ని మాకు వ‌దిలేయండి అంటూ యాంకర్ ప్రశ్నకు జవాబిచ్చారు. తాజాగా ఈ స్టార్‌ జంట విడాకుల విషయంలో మరొక న్యూస్ తెరపైకి వచ్చింది.

న్యూజిలాండ్ క్రికెట్‌ టీమ్‌కు బిగ్ షాక్, టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కేన్ విలియమ్సన్, జస్ట్ టీమ్ మెంబర్‌గా ఉంటానంటూ ప్రకటన, కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

సోయబ్‌ తన ఇన్‌స్టా బయోలో ‘నేను సూపర్‌ వుమన్‌ సానియామీర్జాకు భర్తను’ అంటూ పేర్కొన్నాడు. ‘అథ్లెట్‌, సూపర్‌వుమన్‌ సానియామీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోయబ్‌ బయోకు సంబంధించి పిక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. విడాకులు వార్తలు అంతా పుకారేనని పోస్ట్ ద్వారా తెలుస్తోంది.

India Women vs Australia Women 3rd T20: మూడవ టీ20లో ఆస్ట్రేలియా మహిళా జట్టు చేతిలో టీమిండియా మహిళా జట్టు ఓటమి, 5 టీ 20 మ్యాచుల సిరీస్ లో 2-1తో రాణించిన ఆసీస్.. 

షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2018లో కుమారుడు జన్మించాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement