IPL Auction 2025 Live

Special Trains: తిరుపతికి మరో రెండు ప్రత్యేక రైళ్లు, ఏయే రోజుల్లో నడుస్తుందంటే!

6.10కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంత్రం 5.15కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30కు హైదరాబాద్‌ చేరుకుంటుందని పేర్కొన్నారు.

Credits: ANI

Hyderabad, DEC 25: ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌- తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను(Special Trains) నడుపుతుందని సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ వివరించారు. హైదరాబాద్‌(Hyderabad)- తిరుపతి(Tirupati) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 8.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50కి హైదరాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. హైదరాబాద్‌–తిరుపతి అనే మరో స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 27వ తేదీ సా. 6.10కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంత్రం 5.15కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30కు హైదరాబాద్‌ చేరుకుంటుందని పేర్కొన్నారు.

Mumbai Firing: ముంబైలో కాల్పుల కలకలం, 16 రౌండ్లు ఫైర్ చేసిన వ్యక్తి, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు 

హైదరాబాద్‌–కాకినాడ(Kakinada) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 29న రాత్రి 8.30కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుందని వెల్లడించారు.