Mumbai Firing: (PIC@ ANI X)

Mumbai, DEC 24: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని (Mumbai Firing) కుర్లా సబర్బన్ ప్రాంతంలో జరిగిన ఓపెన్ ఫైర్’లో ఒక వ్యక్తి మరణించగా, మరొక ముగ్గురికి గాయాలయ్యాయని ఆదివారం పోలీసులు తెలిపారు. సుమారు మధ్యాహ్నం 3.15 గంటలకు చున్నాభట్టిలోని ఆజాద్ గల్లీ (Azad galli) ప్రాంతంలో చోటు చేసుకున్నది. స్థానికులపై ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో మరణించిన (Mumbai Firing) వ్యక్తిని సుమిత్ యెరుంకర్‌గా గుర్తించినట్లు చున్నాభట్టి పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

 

నిందితుడు 16 రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్ని క్షతగాత్రులను చికిత్స కోసం సమీప సియాన్ దవాఖానకు తరలించామని చెప్పారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని పట్టుకోవడానికి తొమ్మిది టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు ముంబై 6వ జోన్ డీసీపీ హేమరాజ్ సింగ్ తెలిపారు. ఇది వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడి అని చెప్పారు.