Tamil Nadu Horror: తమిళనాడులో వైద్యుడు దారుణం, మత్తు మందు ఇచ్చి మగవాళ్లపై అత్యాచారం, అనంతరం చంపేసి ఆ భాగాన్ని మసాలాతో వండుకు తిని..

నకిలీ సిద్ధ వైద్యుడు కేశవ మూర్తి(47) పురుషులకు మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వారిని చంపేసి వారి కాలేయాన్ని మసాలాతో వండుకుతిన్నాడు. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.

No rape (Photo-ANI)

Thanjavur, Nov 27:తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని చోళపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నకిలీ సిద్ధ వైద్యుడు కేశవ మూర్తి(47) పురుషులకు మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వారిని చంపేసి వారి కాలేయాన్ని మసాలాతో వండుకుతిన్నాడు. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంజావూరు సమీపంలో అరెస్టయిన స్వలింగ సంపర్కుడు మూర్తి ఇంటి ఆవరణలో తవ్వగా ఎముకలు బయటపడ్డాయి. కాగా గతేడాది 3వ తేదీన మందు కోసం వచ్చిన అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ అశోక్‌రాజ్‌(27)కు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి, అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు. ఈ కేసులో పోలీసులు కేశవమూర్తిని అరెస్టు చేసి, పోలీసులు జరిపిన విచారణలో అశోక్‌రాజ్‌ను హత్య చేసి ముక్కలుగా నరికి ఇంట్లోనే మసాలా వేసి కాలేయాన్ని వండి తిన్నట్టు తెలిపాడు.

ఎంపీలో దారుణం, ఫేస్‌బుక్ స్నేహితురాలిపై ఎమ్మెల్యే బంధువులు సామూహిక అత్యాచారం, కేసు నమోదు చేసిన పోలీసులు

అలాగే నవంబర్‌ 27, 2021, 30వ తేదీన అదే ప్రాంతానికి చెందిన తప్పిపోయిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ అనస్‌ (26)ని కూడా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా చేసి ఇంటి పెరట్లో పూడ్చిపెట్టాడు. కొన్ని భాగాలను వండుకుని తిన్నట్టు తెలిపాడు. ఈ ఘటనలో మహ్మద్‌ అనాస్‌ మృతదేహాన్ని పోలీసులు ఇంకా వెలికితీయకపోగా.. ఇతడిని కూడా కేశవ మూర్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు సందేహించారు.

ఈ కేసులో చోళపురంలో ఉన్న సిద్ధ వైద్యుడు కేశవమూర్తి ఇంటిలో, వేలిముద్రల నిపుణులు ఏడీఎస్పీ హేమ, సహాయ సహాయకుడు రామచంద్రన్‌ (27) సమక్షంలో తిరువిడైందూరు డీఎస్పీ జబర్‌ సిద్ధిక్‌ నేతృత్వంలో కేశవ మూర్తి ఇంట్లో విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పోలీసు జాగిలాలు సోదాలు చేశాయి. ప్రొక్‌లైన్‌ సాయంతో ఇంటిపక్కన చెట్లు, ఇంటిముందు పచ్చిమిర్చి మొక్క. అరటి చెట్లను నరికి తొలగించారు. వరుసగా 2 చోట్ల 3 అడుగుల లోతు తవ్వగా 30కి పైగా ఎముకలు బయటపడ్డాయి. వాటిని తంజావూరు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు.



సంబంధిత వార్తలు

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య

SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్‌ నెంబర్‌ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి

Road Accident in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం.. ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళిన మృతురాలు

Hyderabad Horror: హైదరాబాద్‌ లో ఘోరమైన హత్యలు.. బేగంబజార్‌ లో భార్య, కుమారుడి మర్డర్.. ఆపై ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న భర్త.. చాకచక్యంగా తప్పించుకున్న పెద్ద కొడుకు (వీడియో)