Tamil Nadu Shocker: కసాయి తల్లి..కన్న కూతురిపై కిరసనాయిల్ పోసి తగలబెట్టింది, మూడో భర్త ముందు తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళ

మూడు పెళ్లిల్లు చేసుకున్న ఓ భార్య తన భర్త ముందు తాను పతివ్రతనే అని నిరూపించుకునేందుకు కన్న కూతురుకి (13-year-old girl set ablaze by mother) నిప్పంటించింది. కసాయిగా మారి కన్న కూతురిపై కిరోసిన్ పోసి తగలబెట్టింది

Representational Image | (Photo Credits: IANS)

Chennai, Feb 1: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడు పెళ్లిల్లు చేసుకున్న ఓ భార్య తన భర్త ముందు తాను పతివ్రతనే అని నిరూపించుకునేందుకు కన్న కూతురుకి (13-year-old girl set ablaze by mother) నిప్పంటించింది. కసాయిగా మారి కన్న కూతురిపై కిరోసిన్ పోసి తగలబెట్టింది. ఈ దారుణ ఘటనలో తల్లిని ఆమె మూడో భర్తను Tiruvottiyur పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. . తూత్తుకూడికి చెందిన పాల్‌ వణ్ణన్‌ కొన్నేళ్ల క్రితం భార్య జయలక్ష్మితో (Jayalakshmi) చెన్నైకు వచ్చాడు. వీరికి నిత్య అనే కుమార్తె ఉంది.

కొన్నాళ్ల అనంతరం భర్త, కుమార్తెను వదిలిపెట్టి మరిది దురైరాజ్‌తో జయలక్ష్మి ముంబైకు పారిపోయింది. అక్కడ అతన్ని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసింది. ఆ సమయంలో వీరికి పవిత్ర అనే కుమార్తె కలిగింది. అయితే ఏడేళ్ల క్రితం జయలక్ష్మిని వదిలిపెట్టి దురైరాజ్‌ కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులు ముంబైలో ఉన్న జయలక్ష్మి కుమార్తె పవిత్రతో కలిసి తిరిగి చెన్నై తిరువొత్తియూరుకు వచ్చేసింది. ఇక్కడ కొన్ని రోజులకు ఓ లారీడ్రైవర్‌ను మూడో వివాహం చేసుకుంది.

కామంతో రగిలిన యువకుడు, అసహజ సెక్స్ చేయాలంటూ బాలుడిపై ఒత్తిడి, నో చెప్పడంతో దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

వీరికి కుమార్తె భానుప్రియ(06), కుమారుడు భూపాలన్‌(05) అనే సంతానం కలిగారు. ఇటీవల మూడో భర్త పద్మనాభన్‌ జయలక్ష్మిపై అనుమానంతో రోజూ గొడవపడే వాడు. నీకు ఇంతకు ముందే చెడిపోయావని ఆమెను వేధించసాగాడు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి భర్తతో గొడవపడిన జయలక్ష్మీ, అతడి ఆదేశాల మేరకు నిద్రలో ఉన్న రెండో భర్త దురైరాజ్‌కు పుట్టిన పవిత్రపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టింది.

తగ్గేదేలే అంటూ అమాయకుడిని చంపేశారు, ఆ రెండు సినిమాలు చూసి గ్యాంగ్‌స్టర్‌లుగా ఎదగాలనుకున్న ముగ్గురు టీనేజర్లు, వారి చెప్పిన విషయాలను విని షాక్ తిన్న ఢిల్లీ పోలీసులు

తాను ఏ తప్పు చేయలేదంటూ ప్రతిజ్ఞ చేసింది. ఆతర్వాత కాసేపటికి ఈ కసాయి తల్లి మంటల్లో కాలుతున్న బిడ్డను రక్షించే ప్రయత్నం చేసింది. స్థానికులతో కలసి వెంటనే కీల్పాకం ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ పవిత్ర మృతి చెందింది. సోమవారం పోలీసుల దర్యాప్తులో (Police Arrested husband and wife) జయలక్ష్మి మూడు పెళ్లిల భాగోతం వెలుగు చూసింది. దీంతో ఆమెను, మూడో భర్తను అరెస్టు చేశారు. కాగా వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలుగా రోడ్డున పడ్డారు.