Image used for representational purpose only. | File Photo

New Delhi, Jan 22: జనాల మీద సినిమాల ప్రభావం ( Inspired by gangster films) ఎంతలా ఉంటుందో ఈ దారుణ ఘటనే ప్రత్యక్ష్య సాక్ష్యం. దేశ రాజధాని పరిధిలో జరిగిన ఓ నేరంలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. న్యూఢిల్లీ జహంగీర్‌పురిలో జరిగిన ఓ హత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులకు అల్లు అర్జున్‌ ‘పుష్ప-ది రైజ్‌’ సినిమాతో పాటు ఓ హిందీ వెబ్‌ సిరీస్‌ బౌకాల్‌ స్ఫూర్తితో నేర ప్రవృత్తిలోకి దిగామంటూ ముగ్గురు టీనేజర్లు స్టేట్‌మెంట్‌ ఇవ్వడం కలకలం రేపింది.

నిందితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ బస్తీలో నివాసం ఉంటున్న ముగ్గురు టీనేజర్లలో ఒకడు ‘బద్నాం’ పేరుతో ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ఏరియాలో పాపులర్‌ కావాలనే (become famous in crime world) ఉద్దేశంతో తరచూ ఇతరులకు దమ్‌కీ ఇస్తూ.. ఆ ఘటనలను షార్ట్‌ వీడియోలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప’ సినిమా చూసిన ఆ గ్యాంగ్‌.. అందులో పుష్పరాజ్‌లా ఎదగాలనే ప్లాన్‌వేసింది. ఇందుకోసం అటుగా వెళ్తున్న ఓ అమాయకుడిని ఎంచుకుంది.

నుదుటిన ఎర్రటి బొట్లు..హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబం అత్మహత్య, విషాద ఘటనపై అనేక అనుమానాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆ యువకుడిని చావబాదుతూ (Delhi teens kill an innocent)ఆ వీడియోను రికార్డు చేశారు. వాళ్లను చెదరగొట్టి.. కొనఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. బాబు జగ్జీవన్‌ రామ్‌ ఆస్పత్రిలో ఆ వ్యక్తి మృతి చెందగా.. బాధితుడిని 24 ఏళ్ల శిబుగా గుర్తించారు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బద్నాం గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. తమను తాము ప్రమోట్‌ చేసుకునే ఉద్దేశంతో, గ్యాంగ్‌స్టర్‌లుగా ఎదగాలన్న ఉద్దేశంతో పుష్ప సినిమాను, బౌకాల్‌ సిరీస్‌ను స్ఫూర్తిగా తీసుకున్నామని, వాటిల్లో హీరోల మాదిరిగా ఎదిగే ప్రయత్నం చేశామని చెప్పడంతో కంగుతినడం పోలీసులు వంతూ అయ్యింది. ఈ నేరంలో ముగ్గురు మైనర్లు కావడం విశేషం.