Tamil Nadu Shocker: పెళ్లి చేసుకుంటానంటూ ప్రియుడి మోసం, ఇంటికి పిలిచి సలసల కాగే నూనె పోసి ప్రియురాలు, తీవ్ర గాయాలతో లబోదిబోమంటూ కేకలు వేసిన ప్రియుడు, తమిళనాడులో ఘటన

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రియుడిపై..ప్రియురాలు సలసల కాగుతున్న వేడి నూనె (woman pours hot oil) పోసింది. దీంతో అతడి ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

Representational Image | (Photo Credits: IANS)

Chennai, Mar 13: తమిళనాడులో ఈరోడ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రియుడిపై..ప్రియురాలు సలసల కాగుతున్న వేడి నూనె (woman pours hot oil) పోసింది. దీంతో అతడి ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీలోని వర్ణపురం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల కార్తీ, పెరుందురైలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బంధువైన మీనా దేవితో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది.

ఆర్థిక ఇబ్బందులా లేక వ్యక్తితగ కారణాలా, ఆర్టీసీ బస్సులోనే కండక్టర్ ఆత్మహత్య, తెలంగాణలో విషాదకర ఘటన

దీంతో పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు. అయితే కార్తీకి మరో మహిళతో పెళ్లి సంబంధం కుదిరినట్లు మీనా దేవికి తెలిసింది. ఈ విషయంపై కార్తీని ఆమెను నిలదీసింది. దీంతో వారిద్దరి మధ్య తరచుగా ఈ విషయంపై గొడవ జరుగుతున్నది. శనివారం రోజు మీనా దేవిని కలిసేందుకు ఆమె ఇంటికి కార్తీ వెళ్లాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పెళ్లి విషయంపై మరోసారి వాగ్వాదం జరిగింది.

పెళ్లి చేసుకోను పో అన్న యువతి, కోపంతో ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెట్టిన యువకుడు, జమ్మూలో దారుణ ఘటన

తనను మోసగించాడన్న ఆగ్రహంతో మీనా దేవి రగిలిపోయింది. స్టవ్‌పై మరుగుతున్న వేడి నూనెను కార్తీపై పోసింది. అతడి ముఖం, చేతులపై వేడి నూనె పడింది. దీంతో కాలిన బాధతో కార్తీ కేకలు వేశాడు. అతడి అరుపులు విన్న పొరుగు వారు వెంటనే అక్కడకు వచ్చారు. కార్తీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మీనా దేవి ఇంటికి చేరుకున్నారు.ప్రియుడు కార్తీపై వేడి నూనె పోసిన ప్రియురాలిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Smuggler Arrested in Pushpa 2 Theatre: పుష్ప -2 సినిమా చూస్తూ అడ్డంగా బుక్క‌యిన‌ మోస్ట్ వాటెండ్ స్మ‌గ్ల‌ర్, సినీ ఫ‌క్కీలో థియేట‌ర్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, ఆ త‌ర్వాత ఏమైందంటే?

Woman Chops Off Boyfriends Private Parts: పెళ్లికి ఒప్పుకోలేద‌ని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువ‌తి, ఆపై చేతిని కోసుకొని ఆత్మ‌హ‌త్య‌, ఆ త‌ర్వాత ఏమైందంటే?

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif