Image used for representation purpose only | PTI Photo

Hyd, Mar 13: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆర్టీసీ కండక్టర్‌ బస్సులో ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. తొర్రూర్ మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తొర్రూర్ ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు.వ్యక్తిగత పనుల నిమిత్తం ఇటీవల మూడు రోజులు సెలవు పెట్టాడు. వాటిని రద్దు చేసుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విధుల్లో చేరేందుకు డిపోకు వచ్చాడు.

సెక్యూరిటీ కార్యాలయం రిజిస్టర్‌లో సంతకం పెట్టి బస్సులోకి వెళ్లిన మహేందర్‌రెడ్డి ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి చూడగా బస్సులోని కడ్డీకి ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే డిపో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

మొబైల్ కొనిస్తామని బాలికను రూంలోకి పిలిచి దారుణం, ఒకరి తర్వాత సామూహిక అత్యాచారం, కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి

మృతునికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతోనే కండక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెబుతున్నారు.