Vijay Meets Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌ను కలిసిన విజయ్, తమిళనాట రచ్చగా మారిన ఇద్దరి కలయిక, దుమ్మెత్తి పోస్తున్న ప్రాంతీయ పార్టీలు

తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) చీఫ్‌ విజయ్ మంగళవారం రాజకీయ వ్యూహకర్త, రాజకీయనేత ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. (Vijay meets Prashant Kishor) కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇది అలజడి రేపింది.

Vijay Meets Prashant Kishor

Chennai, FEB 12: తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) చీఫ్‌ విజయ్ మంగళవారం రాజకీయ వ్యూహకర్త, రాజకీయనేత ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. (Vijay meets Prashant Kishor) కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇది అలజడి రేపింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని అధికార డీఎంకేతో (DMK) సహా విపక్ష పార్టీలు విమర్శించాయి. విజయ్‌ ఏసీ గదిలో కూర్చుని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ను (Prashant Kishor) కలవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఎగతాళి చేశారు. దీనికి బదులు జనంలోకి వెళ్లి ప్రజలను కలిస్తే వారి బాధలు తెలుస్తాయని అన్నారు. కాగా, వ్యూహకారుల పట్ల ఈ వ్యామోహం ఒక వ్యాధిగా మారిందని నామ్ తమిళర్ కట్చి (NTK) నేత సీమాన్ విమర్శించారు. ‘శరీరంలో కొవ్వు గురించి మీరు విని ఉండవచ్చు. కానీ ఇది డబ్బు వల్ల లావుగా మారుతుంది’ అని ఎద్దేవా చేశారు.

Chiranjeevi: వీడియో ఇదిగో, మా తాత పెద్ద రసికుడు, ఆయన బుద్ధులు నాకు రాకూడదని మా అమ్మ కోరుకునేది, మరోసారి వార్తల్లోకెక్కిన చిరంజీవి 

మరోవైపు గతంలో ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పని చేసిన అధికార డీఎంకే భిన్నంగా స్పందించింది. ఎన్నికల వ్యూహాల కోసం తమ పార్టీ కార్యకర్తలపై డీఎంకే ఆధారపడుతుందని ఎంపీ కనిమొళి తెలిపారు. ‘ప్రశాంత్ కిషోర్ ఒక ప్రొఫెషనల్ వ్యూహకర్త. ఆయనను ఎవరు పిలిచినా, వారితో కలిసి పనిచేస్తారు. దీనితో మనకు ఏం సంబంధం? డీఎంకే తన పార్టీ కార్యకర్తల బలంతో ఎన్నికలను ఎదుర్కొంటుంది. సీఎం స్టాలిన్ మనకు చూపించే మార్గం నాయకులంతా అనుసరించే మార్గం. మాకు ఎలాంటి సమస్యలు లేవు’ అని ఆమె అన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Advertisement
Advertisement
Share Now
Advertisement