మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే తన వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న చిరు ఇదే వేడుకలో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో మరోసారి వైరల్ అవుతున్నాడు. బ్రహ్మా ఆనందం సినిమా వేడుకలో యాంకర్ సుమ చిరంజీవికి మైక్ ఇచ్చి తన తాత గురించి మాట్లాడమని కోరుతుంది. దీంతో తన తాత పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ మాట్లాడారు.
అమ్మగారి నాన్న, మా తాత రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లురు వాసి అయినప్పటికీ మొగల్తూరులో సెటిల్ అయ్యాడు. మా అమ్మ తరచూ చెప్పేది.. నీకు ఎవరి బుద్ధులు వచ్చినా పర్లేదు కానీ, మీ తాత బుద్ధులు రాకూడదు అని చెప్పుకోచ్చేది. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవాళ్లు. వీరిద్దరి మీద అలిగితే ఇంకో అమ్మమ్మ దగ్గరికి వెళ్లేవాడు. అంత ఆదర్శప్రాయుడు మా తాట అంటూ ఆయన గురించి చెప్పుకోచ్చారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
నీకు ఎవరి బుద్ధి వచ్చినా పర్వాలేదు మా తాత బుద్దులు రావొద్దని అనే వాళ్లు
మా తాత రసికుడు
నీకు ఎవరి బుద్ధి వచ్చినా పర్వాలేదు మా తాత బుద్దులు రావొద్దని అనే వాళ్లు
నాకు ఇద్దరు అమ్మమ్మలు ఉండే వాళ్ళు.. ఆయన వీళ్ళ ఇద్దరి మీద అలిగి ఇంకొక ఆమెకు దగ్గరయ్యారు.. ఇంకా ఎంత మంది ఉన్నారో నాకు తెలియదు - చిరంజీవి pic.twitter.com/USaDk2KR5D
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)