Man Kills Mother For Insurance: ఆన్‌లైన్ గేమ్స్ కు బానిసై ఇన్సురెన్సు కోసం తల్లినే చంపేశాడు! మేనత్త నగలు చోరీ చేసి తల్లిదండ్రుల పేరు మీద ఇన్సురెన్స్ చేయించిన కొడుకు, తల్లిని చంపి యమునా నదిలో పడేసిన కిరాతకుడు

ఈ నేపథ్యంలో స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడంతో బంధువైన మహిళకు చెందిన నగలు చోరీ చేశాడు. వాటిని అమ్మి ఆ డబ్బుతో తల్లిదండ్రుల పేరు మీద ఇన్సురెన్స్‌ పాలసీలు కొన్నాడు. బీమా డబ్బుతో అప్పులు తీర్చేందుకు తల్లిని హత్య చేశాడు.

Representational Purpose Only (File Image)

Fatehpur, FEB 25: ఒక వ్యక్తి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు (Gaming Addict) బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడంతో బంధువైన మహిళకు చెందిన నగలు చోరీ చేశాడు. వాటిని అమ్మి ఆ డబ్బుతో తల్లిదండ్రుల పేరు మీద ఇన్సురెన్స్‌ పాలసీలు కొన్నాడు. బీమా డబ్బుతో అప్పులు తీర్చేందుకు తల్లిని హత్య చేశాడు. (Man kills mother for insurance) ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో (Fatehpur) ఈ సంఘటన జరిగింది. హిమాన్షు అనే వ్యక్తి జూపీ అనే యాప్‌లో ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసయ్యాడు. పదేపదే నష్టపోవడంతో అప్పులు చేశాడు. వాటిని చెల్లించేందుకు స్నేహితుల నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు. కాగా, డబ్బు తిరిగి ఇవ్వాలని హిమాన్షుకు స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది.

Doctor Stabbed by 18 Times: నాసిక్‌లో దారుణం, ఫోన్ మాట్లాడుతున్న వైద్యుడిని 18 సార్లు కత్తితో నరికిన ఉద్యోగి, అదే పనిగా నరుకుతున్న షాకింగ్ వీడియో బయటకు.. 

దీంతో గత ఏడాది డిసెంబర్‌లో మేనత్త నగలు చోరీ చేశాడు. ఆ డబ్బుతో తల్లిదండ్రుల పేరు మీద రూ.50 లక్షల చొప్పన ఇన్సూరెన్స్‌ పాలసీలు కొన్నాడు. బీమా డబ్బుతో అప్పులు తీర్చాలని భావించాడు. తండ్రి రోషన్ సింగ్ ఇటీవల చిత్రకూట్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా 50 ఏళ్ల తల్లి ప్రతిభను కుమారుడు హిమాన్షు హత్య చేశాడు. శవాన్ని మూటకట్టి ట్రాక్టర్‌లో తీసుకెళ్లాడు. తల్లి మృతదేహాన్ని యమునా నదిలో పడేశాడు.

Uttar Pradesh Accident: యూపీలో ఘోర ప్రమాదం.. నదిలోపడిన యాత్రికుల ట్రాక్టర్‌.. చిన్నారులు సహా 15 మంది మృతి 

మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన రోషన్‌ సింగ్‌, తన భార్య, కుమారుడు కనిపించకపోవడంతో స్థానికులు, బంధువులను ఆరా తీశాడు. హిమాన్షు ట్రాక్టర్‌తో నది తీరంలో కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 21న పోలీసులను అలెర్ట్‌ చేయడంతో అతడ్ని అరెస్ట్‌ చేశారు. హిమాన్షును ప్రశ్నించగా తల్లిని హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేసినట్లు చెప్పాడు. దీంతో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif