IPL Auction 2025 Live

UP Shocker: ఇదో రకం మోసం, ఎన్ఆర్ఐ యువతినంటూ అమ్మాయిలతో ఛాటింగ్, న్యూడ్ ఫోటోలు పంపాలని బ్లాక్ మెయిల్, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలలో అనేక నకిలీ ఖాతాలను క్రియేట్‌ చేశాడు.

man-loses-4-lakhs-due-calls-customer-care-food-delivery-platform-lucknow ( Photo Credit: Getty )

Lucknow, Sep 7: ఎన్ఆర్ఐ యువతి పేరుతో అమ్మాయిలపై బ్లాక్ మెయిల్ కు పాల్పడిని యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలలో అనేక నకిలీ ఖాతాలను క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత వాటి ద్వారా చాలా మంది అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌ పేట్టేవాడు. తాను ఒక ఎన్నారై యువతినని (Man poses as NRI girl), కెనడాలో ఉంటానని చెప్పేవాడు. అతగాడి రిక్వెస్ట్‌కు రిప్లై ఇచ్చిన వారితో కొన్నిరోజులు బాగానే చాటింగ్‌ చేసేవాడు.

అలా బాగా క్లోజ్ అయిన తర్వాత అవతలి యువతికి తన నకిలీ న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపించేవాడు. అంతటితో ఆగకుండా నువ్వుకూడా నీ పర్సనల్ ఫొటోలు, వీడియోలను పంపాలని అమ్మాయిని కోరేవాడు. ఈ క్రమంలో అతగాడి మాయలో పడిన కొందరు వారి పర్సనల్ ఫొటోలు, వీడియోలు పంపేవారు. అలా తన చేతికి అవతలి అమ్మాయిల అశ్లీల వీడియోలు, ఫొటోలు చిక్కగానే తన అసలు రంగును బయటపేట్టేవాడు. తాను అడిగినంతా డబ్బులు ఇవ్వాలని, లేకపోతే ఫొటోలను, వీడియోలను నెట్టింట పెడతానని బెదిరింపులకు దిగేవాడు. ఇలా చాలామంది అతడి ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడారు.

వర్షాలు పడాలని ఆరు మంది బాలికలను నగ్నంగా ఉరేగించారు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దమోహ్‌ జిల్లాలో దారుణం, ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌

ఇదే విధంగా ఆ దుర్మార్గుడికి 15 ఏళ్ల ఓ బాలిక కూడా ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెతో చాలా రోజులు చాటింగ్ చేశాడు. ఆ తర్వాత బాలిక ఫొటోలు, వీడియోలు తీసుకుని వేధింపులకు (blackmails) పాల్పడ్డాడు. అయితే, ఆ అమ్మాయి తన పేరెంట్స్‌కు జరిగిన విషయం చెప్పడంతో అతగాడి బాగోతం బయటపడింది.

బాధిత బాలిక తల్లిదండ్రులు వెంటనే యూపీలోని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు వినియోగించిన ఫోన్ నెంబర్‌తో పాటు వాట్సాప్, ఇన్‌స్టా ఐడీల ద్వారా అతగాడిని గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.