Uttar Pradesh: తాళికట్టే సమయంలో వరుడు జంప్, జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చి తాళి కట్టించుకున్న వధువు, కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే..

యూపీలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. కట్టుకోబోయే వాడు పారిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. వెంటాడి పట్టుకొచ్చి మరీ వధువు మనువాడింది.యూపీలోని బారాబంకి పోలీసు స్టేషన్ పరిధిలో బారాదరి ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. సదరు వధువు రెండున్నరేళ్లుగా ఓ వ్యక్తితో అనుబంధం సాగిస్తోంది.

Wedding Representational Image

Lucknow, May 23: యూపీలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. కట్టుకోబోయే వాడు పారిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. వెంటాడి పట్టుకొచ్చి మరీ వధువు మనువాడింది.యూపీలోని బారాబంకి పోలీసు స్టేషన్ పరిధిలో బారాదరి ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. సదరు వధువు రెండున్నరేళ్లుగా ఓ వ్యక్తితో అనుబంధం సాగిస్తోంది.

ఇరు వైపుల కుటుంబాల అంగీకారంతో పెళ్లి కుదిరింది. గత ఆదివారం భూతేశ్వర్ నాథ్ ఆలయంలో వీరికి వివాహం ఏర్పాటు చేశారు. కానీ, వివాహ ముహూర్తం సమీపించినా అక్కడ వరుడి జాడ లేదు. వధువు తనను మనువాడబోయే వాడి కోసం వేచి చూసి చూసి ఇక లాభం లేదనుకుని కాల్ చేసింది.తనను క్షమించాలని, తన తల్లిని తీసుకువచ్చేందుకు బుదాన్ వెళుతున్నట్టు చెప్పాడు.

కూతురు ప్రేమ గురించి తెలియక పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పెళ్లయిన తెల్లారే ప్రియుడితో కలిసి వధువు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ పెళ్లికూతురు మృతి

దీంతో పెళ్లి కూతురు క్షణం ఆలస్యం చేయకుండా తన వాళ్లను వెంట పెట్టుకుని వరుడి కోసం వెతికేందుకు బయలుదేరింది. బరేలీకి 20 కిలోమీటర్ల దూరంలో భిమోర పోలీసు స్టేషన్ పరిధిలో అతడ్ని పట్టుకుంది. ఓ బస్సు ఎక్కుతుండగా అతడ్ని పట్టుకుని పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. ఇంకేముంది.. మూడు ముడ్లు, మేళతాళాలు, అక్షింతలతో వివాహం ముగిసింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Actress Jayaprada's Brother Passed Away: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Satwiksairaj’s Father Passes Away: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?

Gurgaon Shocker:ఘోరం.. నైట్ డ్యూటీకి వెళుతూ కూతురిని మేనమామ ఇంట్లో వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు, దారుణంగా అత్యాచారం చేసిన మేనమామ స్నేహితుడు

Advertisement
Advertisement
Share Now
Advertisement