Uttar Pradesh Horror: యూపీలో దారుణం, భార్య లేదని తాగిన మత్తులో కన్న కూతురుపై అత్యాచారం

యూపీలోని అమేథీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ మరిచిన ఓ తండ్రి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఈ నెల 8 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Representational Image (File Photo)

Amethi, August 16: యూపీలోని అమేథీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ మరిచిన ఓ తండ్రి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఈ నెల 8 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం జరిగిన వారం రోజుల తర్వాత బాధిత బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తల్లి చనిపోవడంతో ఫిర్యాదు చేయలేకపోయానని ఆమె తెలిపింది.  దారుణం, కన్న కూతురుపై మూడు నెలల నుంచి తండ్రి అత్యాచారం, నరకయాతన తట్టుకోలేక తుపాకీతో కాల్చి చంపిన కూతురు

ఘటన జరిగిన రోజున బాధిత బాలిక తల్లి ఢిల్లీలోని తన సోదరి ఇంటికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. తాగి ఇంటికి వచ్చిన తండ్రి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఢిల్లీ వెళ్లిన బాలిక తల్లి రెండు రోజుల తర్వాత ఈ నెల 10న అక్కడే మృతి చెందింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సర్కిల్ ఆఫీసర్ అతుల్ సింగ్ తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement