Rape Representative image.

Lahore, September 26: దాయాది దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ 14 ఏళ్ల పాకిస్థాన్ బాలిక శనివారం తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపిందని (girl shoots father dead for raping ) పోలీసులు తెలిపారు. లాహోర్ నగరంలోని గుజ్జర్‌పురా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది, తన తండ్రి గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాలిక తెలిపింది.

"తాను నరకం అనుభవిస్తున్నానని, అత్యాచారం చేసిన తన తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నానని, అందుకే అతని తుపాకీతో కాల్చి చంపానని ఆమె చెప్పింది" అని కేసు దర్యాప్తు చేస్తున్న సోహైల్ కజ్మీ చెప్పారు.దీంతో బాలిక తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు కజ్మీ తెలిపారు. అమ్మాయి తండ్రి బిలాల్ ఖాన్, వృత్తిరీత్యా టైలర్. అయితే రాత్రి కాగానే మైనర్ కుమార్తెను పక్కలోకి రావాలని, వేధించేవాడని, రాకుంటే కొట్టి మరీ లాక్కుని వెళ్లి అత్యాచారం చేసేవాడని పోలీస్ అధికారి తెలిపారు.

ముంబైలో దారుణం, కదులుతున్న ట్యాక్సీలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ దారుణం తట్టుకోలేక శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఖాన్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతని టీనేజ్ కుమార్తె తలపై కాల్చి చంపింది. అతను అక్కడికక్కడే మరణించాడని ఆ అధికారి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత నిందితుడిపై కేసు నమోదు చేస్తామని అధికారి తెలిపారు.

జార్ఖండ్‌‌లో దారుణం, ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన మహిళ, అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయిన నిందితురాలు

తన మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పాకిస్థాన్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించిన ఒక రోజు తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన నిందితుడు ఎం. రఫీక్‌కు లాహోర్‌లోని లింగ-ఆధారిత హింస కోర్టు అదనపు సెషన్స్ జడ్జి మియాన్ షాహిద్ జావేద్ మరణశిక్ష విధించారు.