Representational Image (Photo Credits: Pixabay)

Jharkhand, Sep 20: జార్ఖండ్‌ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లా తారాతండ్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. ఆ ఘటనతో ప్రియుడు అపస్మారక స్థితికి చేరగా.. అతను చనిపోయాడని భావించింది. దాంతో ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆ మహిళ పెళ్లై భర్తకు దూరంగా, ఒంటరిగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన పెళ్ళైన యువకుడు సుశీల్ తుడుతో ఆమెకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది.పెళ్లి చేసుకోమని ఆమె బలవంతం చేయగా సుశీల్ ఒప్పుకోవట్లేదని ప్రైవేట్‌గా కలవాలంటూ, అతన్ని పిలిచింది. సుశీల్ ఆమెతో సరసాలు మొదలు పెట్టాడు.

దారుణం, భర్త పురుషాంగంపై సలసల కాగే నూనె పోసిన భార్య, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన మొగుడు

అప్పటికే పక్కా ప్లాన్‌తో సిద్ధంగా ఉన్న మహిళ చేతిలో బ్లేడ్ తీసుకుని అతని ప్రైవేట్ భాగాలను కట్ చేసింది.దాంతో అతను అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతను చనిపోయాడని భావించిన మహిళ నేరుగా తారాతాండ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది.సుశీల్ చనిపోలేదని, అపస్మారక స్థితిలోకి వెళ్లాడని గుర్తించిన పోలీసులు.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ మహిళతో పాటు అతనిపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.