UP Shocker: యూపీ ఉన్నావ్‌లో దారుణం, ఆ పార్టులో రక్తం కారి ఏడుస్తున్నా వదలని ప్రియుడు, మాత్రలు వేసుకుని మరీ లవర్‌పై దారుణంగా అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కాలేజ్ స్టూడెంట్‌పై ఓ కామాంధుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు మానవ మృగంలా మారి ఆమెపై అత్యాచారం చేయడంతో ఆమె (She Died) కన్నుమూసింది.
Lunknow, Nov 14: యూపీలో దారుణ ఘటన చోటు (Uttar Pradesh Shocker) చేసుకుంది. కాలేజ్ స్టూడెంట్‌పై ఓ కామాంధుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు మానవ మృగంలా మారి ఆమెపై అత్యాచారం చేయడంతో ఆమె (She Died) కన్నుమూసింది. ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్‌లో జరిగిన ఈ ఘోర హత్యాచార ఘటన (College Student Raped) స్థానికంగా కలకలం రేపింది.
ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లిన సమయంలో ఆ యువతిపై ఈ దారుణం జరిగింది. తిరిగొచ్చి చూసేసరికి యువతి రక్తపుస్రావంతో నగ్నంగా బెడ్‌పై స్పృహ లేకుండా పడి ఉంది. అది గమనించిన ఆమె సోదరి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. యువతిపై అత్యాచారం జరిగిందని, ఆ ప్రయత్నంలోనే రక్తస్రావంతో ఆమె కన్నుమూసిందని వైద్యుల నివేదికలో తేలింది.
పొరుగింట్లో ఉండే ఓ వృద్ధుడే ఈ దారుణానికి పాల్పడ్డారని అంతా అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే.. యువతి ఫోన్ డేటా ఆధారంగా రాజ్ గౌతమ్ అనే యువకుడిని సైతం పోలీసులు ప్రశ్నించగా తను నేరం ఒప్పుకున్నాడు. ఆ కామాంధుడు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ గౌతమ్ స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. బాధితురాలితో రెండేళ్లుగా అతనికి పరిచయం ఉంది. ఆమె తన ఛాతీపై అతని పేరు పచ్చబొట్టు వేయించుకుంది. అయితే వీళ్ల ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియదు.
ఈ నేపథ్యంలో గురువారం ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకుని వెళ్లాడు. ఆపై ఆమెను శారీరకంగా కలిసేందుకు యత్నించాడు. కానీ, ఆమె ప్రతిఘటించింది. దీంతో బలవంతం చేశాడు.నేరానికి ముందు నిందితుడు గౌతమ్ ఎనర్జీ పిల్స్(అఫ్రొడిసియాక్ మాత్రలు) తీసుకుని ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు.ఆ యువతి స్పృహ కోల్పోయినా.. వదలకుండా అత్యాచారానికి పాల్పడడంతో ఆమె అధిక రక్తస్రావం అయ్యి మరణించింది. ఘటన తర్వాత భయంతో అక్కడి నుంచి నిందితుడు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్‌కు తరలించారు. బాధిత కుటుంబం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.