Rajasthan Shocker: దొంగతనానికి వచ్చి కామాంధులైన నలుగురు, భర్తను చితకబాది భార్యపై దారుణంగా అత్యాచారం, రాజస్థాన్‌లో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి (Woman Gang-Raped) పాల్పడ్డారు.

Rajasthan Shocker: దొంగతనానికి వచ్చి కామాంధులైన నలుగురు, భర్తను చితకబాది భార్యపై దారుణంగా అత్యాచారం, రాజస్థాన్‌లో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Rape Attempt (Representational: Getty)

Sirohi, Nov 14: రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి (Woman Gang-Raped) పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు.పిండ్వారా డీఎస్పీ జెతు సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సమయంలో నలుగురు దుండగులు దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లోని దంపతులను బెదిరించి రూ.1,400 నగదు, కొంత వెండి, బంగారు ఆభరణాలను లాక్కున్నారు.

అనంతరం భర్తను కట్టేసి అతని కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం (Woman Gang-Raped In Front Of Husband) చేశారు. రెండు రోజుల అనంతరం దంపతులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.

మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన మామ, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగా తిరిగిరాని లోకాలకు, రాజస్థాన్‌లో విషాద ఘటన

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (పింద్వారా) జేతు సింగ్ మాట్లాడుతూ, మహిళ భర్త వాచ్‌మెన్‌గా పనిచేశారని చెప్పారు. బుధవారం రాత్రి దంపతులు నిద్రించేందుకు సిద్ధమవుతుండగా నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వారిని బందీలుగా పట్టుకున్నారు. ఇంట్లో రూ. 1,400 నగదుతో దోచుకోగా మరింత నగదు మరియు ఇతర విలువైన వస్తువుల ఎక్కడ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఏమీ లేవని చెప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

(The above story first appeared on LatestLY on Nov 14, 2022 01:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).