UP Shocker: లిఫ్ట్ అడిగిన పాపానికి యువతిపై తెగబడిన కామాంధులు, కారులోనే ఒకరి తర్వాత ఒకరు దారుణంగా అత్యాచారం,యూపీలో షాకింగ్ ఘటన వెలుగులోకి..

కదులుతున్న కారులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై కామాంధులు అఘాయిత్యానికి (Engineering student raped)పాల్పడ్డారు.

Rape Representative image.

Lucknow, Oct 10: ఉత్తర ప్రదేశ్‌ జైసింగ్‌పూర్ ఏరియా సుల్తానాపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై కామాంధులు అఘాయిత్యానికి (Engineering student raped)పాల్పడ్డారు.ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై కదులుతున్న కారులో (moving car in Sultanpur) అత్యాచారం చేసి కాలువ దగ్గర పడేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.శుక్రవారం సాయంత్రం 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి ఇంటికి తిరిగి వెళ్లేందుకు రోడ్డు మీద నిల్చుంది. అయితే సెలవుల సీజన్‌ కావడంతో ఎంతకీ బస్సులు రాలేదు. దీంతో అటుగా వస్తున్న ఓ ప్రైవేట్‌వాహనాన్ని ఆపి లిఫ్ట్‌ అడిగింది.

ఈ క్రమంలో ఆమెను ఎక్కించుకున్నాక.. డ్రైవర్‌ సీట్‌లో ఉన్న వ్యక్తి వెనకాలకు వచ్చాడు. ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి కారును నడుపుతుండగా.. యువతిపై కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు కామాంధుడు. అనంతరం ఆమెను దగ్గర్లో ఉన్న కాలువ వద్ద పడేసి.. ఆ ఇద్దరూ పారిపోయారు. అనంతరం ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు పోలీసులు.

సీనియర్లను పొరపాటున ఢీకొట్టిన 11 ఏళ్ల విద్యార్థిని.. సారీ చెప్పినా వినిపించుకోకుండా టాయిలెట్ గదిలోకి లాక్కెళ్లి రేప్ చేసిన సీనియర్లు.. టీచర్ కు బాలిక ఫిర్యాదు.. బయట ఎవరికీ చెప్పొద్దన్న ఉపాధ్యాయిని.. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో దారుణం

వైద్య నివేదిక ప్రకారం. అత్యాచారం జరిగిందని నిర్దారించుకున్న పోలీసులు.. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని, ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని సర్కిల్ ఆఫీసర్, జైసింగ్‌పూర్ ప్రశాంత్ సింగ్ తెలిపారు.