‘Thalapathy 69’: ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి సినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే విజ‌య్ 69, ఇంత‌కీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

త‌మిళ సూప‌ర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్చివ‌రి చిత్రం అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. రాజ‌కీయ‌ల్లోకి ఎంట్రీ విజ‌య్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంద‌రూ గోట్ సినిమానే విజ‌య్‌కు చివ‌రి చిత్రం అనుకున్నారు. అయితే గోట్ కాకుండా అభిమానుల కోసం మ‌రో సినిమాను ప్ర‌క‌టించాడు విజ‌య్. త‌న చివ‌రి చిత్రం ప్ర‌జ స‌మ‌స్య‌ల‌పై ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు

Thalapathy 69, Vijay (Photo Credits: @kvn.productions/ Instagram)

Chennai, SEP 14: త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ (Thalapathy Vijay) చివ‌రి చిత్రం అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. రాజ‌కీయ‌ల్లోకి ఎంట్రీ విజ‌య్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంద‌రూ గోట్ సినిమానే విజ‌య్‌కు చివ‌రి చిత్రం అనుకున్నారు. అయితే గోట్ కాకుండా అభిమానుల కోసం మ‌రో సినిమాను ప్ర‌క‌టించాడు విజ‌య్. త‌న చివ‌రి చిత్రం  ప్ర‌జ స‌మ‌స్య‌ల‌పై ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.  విజ‌య్ ప్ర‌స్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) సినిమా స‌క్సెస్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.

Check ‘Thalapathy 69’ First Look Poster Below: 

 

వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 05న వ‌రల్డ్ వైడ్‌గా విడుద‌లై మంచి విజయాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా.. రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అయితే ఈ సినిమానే విజ‌య్‌కు చివ‌రి చిత్రం అని ప్ర‌చారం జ‌రిగింది. విజ‌య్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తుండ‌టంతో అభిమానులు కూడా ద‌ళ‌ప‌తికి ఇదే లాస్ట్ మూవీ అని గోట్ సినిమాకు త‌ర‌లివెళుతున్నారు.

Jr NTR Responds Cancer Patient Fan: అభిమానికి ఎన్టీఆర్‌ వీడియో కాల్..దేవర సినిమా చూడాలనేది చివరి కోరిక  అన్న దానిపై స్పందించిన తారక్, అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష 

అయితే తాజాగా ద‌ళ‌ప‌తి 69 సినిమాకు (Torch Bearer Of Democracy) సంబంధించి అప్‌డేట్‌ను పంచుకున్నారు మేక‌ర్స్. ద‌ళ‌ప‌తి 69 గా వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్‌ను కార్తీ (ఖాకీ) సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న హెచ్.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. అనిరుధ్ సంగీతం అందించ‌నుండ‌గా.. క‌న్న‌డ టాప్ బ్యాన‌ర్ కేవీఎన్ ప్రోడ‌క్ష‌న్ ఈ మూవీని నిర్మించ‌నుంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుందని టాక్. ఈ సినిమాను అక్టోబర్ 2025న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement