Us Deportation: పంజాబ్‌ ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్ర! అమెరికా నుంచి వచ్చే విమానాలను అమృత్‌సర్‌లో దించడంపై మండిపడ్డ సీఎం మాన్

అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయులను తీసుకొచ్చే రెండు విమానాలు అమృత్‌సర్‌లో (Amritsar Airport) దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే విషయం తాజాగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో వచ్చే ఈ విమానాలను అమృత్‌సర్‌లోనే దించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మండిపడ్డారు.

Amritsar, FEB 14: అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయులను తీసుకొచ్చే రెండు విమానాలు అమృత్‌సర్‌లో (Amritsar Airport) దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే విషయం తాజాగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో వచ్చే ఈ విమానాలను అమృత్‌సర్‌లోనే దించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌లో భవనాల కూల్చివేత..వందేళ్ల చరిత్ర కలిగిన భవనాలు నేలమట్టం, ఆధునీకరించనున్న ప్రభుత్వం  

‘‘119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందిన వారని.. అందుకే అమృత్‌సర్‌లో విమానం ల్యాండ్‌ చేస్తున్నామని వాళ్లు చెబుతున్నారు. అలా అయితే.. మొదట వచ్చిన విమానం అహ్మదాబాద్‌లో ఎందుకు దిగలేదు? కేవలం పంజాబ్‌ ప్రతిష్ఠను దిగజార్చాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు’’ అని భగవంత్‌ మాన్‌ ఆరోపించారు.

Andhra Pradesh Acid Attack Case: యువ‌తిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి, నా చెల్లెలికి అండగా ఉంటానని తెలిపిన నారా లోకేష్, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు 

‘డిపోర్టేషన్‌’ ఆపరేషన్‌లో భాగంగా ఫిబ్రవరి 5న 104 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం (US Deportation) అమృత్‌సర్‌కు చేరుకుంది. మరో 119 మందితో వచ్చే విమానం ఫిబ్రవరి 15న పంజాబ్‌లోనే దిగనుంది. ఫిబ్రవరి 16న మరో విమానం కూడా అక్కడికే రానుంది. శనివారం వచ్చే 119 వలసదారుల్లో 69 పంజాబ్‌, 33 మంది హరియాణా, ఎనిమిది మంది గుజరాత్‌, యూపీకి చెందిన వారు ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందినవారు ఇద్దరు చొప్పున, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement