![](https://test1.latestly.com/uploads/images/2025/02/30-209-1-.jpg?width=380&height=214)
Vjy, Fab 14: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లె గ్రామానికి చెందిన యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడిన సంగతి విదితమే. ఈ దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె ఫ్యామిలీకి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అటు ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఆమె పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్ధన్ కు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆయనకు పూర్తి భరోసా ఇచ్చారు. చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం. ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాడిచేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం, అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.
కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
బాధిత యువతికి మెరుగైన వైద్యం అందిస్తామని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. (2/2)
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 14, 2025
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఆ సోదరికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తాం. గౌతమిపై అత్యంత అమానవీయంగా వ్యవహరించిన సైకోని కఠినంగా శిక్షిస్తాం. భవిష్యత్ లో మరో చెల్లిపై ఇటువంటి ఘటనలు…
— Lokesh Nara (@naralokesh) February 14, 2025
అధైర్య పడొద్దు, మీ వెంట నేనున్నాను" అంటూ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. అక్కడే ఉన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తో కూడా మాట్లాడిన లోకేశ్... బాధితురాలు కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆమె వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా సూచించారు.
యాసిడ్ దాడికి, అత్యాచారానికి గురైన బాధితురాలిని ఏపీ అధికారులు బెంగళూరుకు తరలిస్తున్నారు. బాధితురాలిని మొదట మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బెంగళూరుకు తరలించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బాధితురాలిని అధికారులు బెంగళూరుకు తరలిస్తున్నారు.