NEET Topper Remark on Protests: నిరసనలకు వెళ్లడం కంటే చదివితే మార్కులు పెరుగుతాయి.. నీట్ టాపర్ సంచలన వ్యాఖ్యలు..

నీట్-యూజీ 2026 పునఃపరీక్షలో 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా 2వ ర్యాంక్ (715 మార్కులు) సాధించిన పన్షుల్ బన్సల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నప్పటికీ.. తాను వీధుల్లోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Panshul Bansal (Photo Credits: X\@Swati_pndy)

NEET Topper Remark on Protests: నీట్-యూజీ 2026 పునఃపరీక్షలో 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా 2వ ర్యాంక్ (715 మార్కులు) సాధించిన పన్షుల్ బన్సల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నప్పటికీ.. తాను వీధుల్లోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

న్యూఢిల్లీలోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ విద్యార్థి అయిన బన్సల్.. ఎన్‌డిటివి ప్రతినిధి శివ్ అరూర్‌తో మాట్లాడుతూ.. నిరసనలకు సమయం వెచ్చించే బదులు ఇంట్లోనే చదువుకుంటూ నైపుణ్యాలను, స్కోరును మెరుగుపరుచుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకున్నానని చెప్పారు.

అసలు మే 3న జరగాల్సిన పరీక్ష పత్రం లీక్ అయిందన్న ఆరోపణలతో మే 12న రద్దు కావడం మొదట్లో తీవ్ర నిరాశ, విచారాన్ని కలిగించినప్పటికీ, ఒకటి రెండు గంటల్లోనే దానిని సానుకూల దృక్పథంతో స్వీకరించినట్లు బన్సల్ పేర్కొన్నారు. మొదట రాసిన పరీక్షలో 706 మార్కులు సాధించిన ఆయన.. పునఃపరీక్షలో తన స్కోరును 715 మార్కులకు పెంచుకున్నారు.

Why Protest When I Can Study?: NEET Topper Panshul Bansal Strong Message to Students

అదనపు సమయం దొరికినప్పటికీ తన రోజువారీ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదని, శక్తివంచన లేకుండా కృషి చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేశానని వెల్లడించారు. దేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను కోరుతూ జరుగుతున్న నిరసనలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఈ పేపర్ లీక్ ఉదంతంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. తీవ్ర భద్రతా ఏర్పాట్ల నడుమ జూన్ 21న నిర్వహించిన పునఃపరీక్ష ఫలితాలను జూలై 16న ప్రకటించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement