
Hyd, March 5: నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు(Telangana Inter Exams).
రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఉ. 8.45 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల లోపు విద్యార్థులకు అనుమతి ఉండనుంది. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల వరకు జీరాక్స్ సెంటర్లు, షాపులు మూసివేశారు.
పరీక్ష కేంద్రానికి ముందుగా వస్తే విద్యార్థులకు సేఫ్(Telangana Inter Exam 2025 ). ముందుగా వస్తే omr షీట్ ఫీల్ చేసుకొనే అవకాశం ఉంటుంది. పరీక్ష పర్యవేక్షకులు చీఫ్ సూపరింటెండెంట్స్ 1532,డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 1532,ఇన్విజిలేటర్లు 29 వేల 992 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్ 72 మంది,సిట్టింగ్ స్క్వాడ్ 124 మందిని నియమించారు.
ఇక నాంపల్లి ఇంటర్ బోర్డ్ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. 1532 సెంటర్లను సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. వాచ్‌ను కూడా అనుమతించరు. ప్రశ్న పత్రాలు పోలీస్ ఎస్కార్ట్ తో సెంటర్ కి చేరుతాయి.
పరీక్ష కేంద్రాల పరిదిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు