Akshay Kumar Tests Positive: అక్షయ్‌ కుమార్‌కు మరోసారి కరోనా, మిస్ అవుతున్నా అంటూ మూవీ టీమ్‌ కు మెసేజ్, ఆందోళన బాలీవుడ్, త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ట్వీట్లు

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay kumar) మరోసారి కరోనా (Corona) బారిన పడ్డారు. ఆయన గతంలో కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన పృథ్విరాజ్ (Prudiviraj) సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. 2022లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes) కు ఈ చిత్ర టీం హాజరవ్వాల్సి ఉంది.

Akshay Kumar (Photo Credits: Instagram)

New Delhi, May 15: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay kumar) మరోసారి కరోనా (Corona) బారిన పడ్డారు. ఆయన గతంలో కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన పృథ్విరాజ్ (Prudiviraj) సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. 2022లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes) కు ఈ చిత్ర టీం హాజరవ్వాల్సి ఉంది. అయితే అక్షయ్ కి కరోనా సోకడంతో ట్విట్టర్లో.. ”అంత బాగానే ఉంది అనుకున్న టైంకి మళ్ళీ నాకు కరోనా వచ్చింది. కాన్స్ 2022 వేడుకలలో పాల్గొనాలి. కానీ ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లే నా టీం అందరికి బెస్ట్ విషెష్. మిమ్మల్ని మిస్ అవుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు. అక్షయ్ మరోసారి కరోనా బారిన పడ్డారని తెలిసి అభిమానులు, నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

గత రెండు సంవత్సరాల నుంచి కరోనాతో చాలా మంది ఎఫెక్ట్ అయిన సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు కరోనాతో మరణించారు. సినీ పరిశ్రమకి తీరని లోటు ఏర్పడింది. దీంతో ఇండస్ట్రీలో ఎవరికైనా కరోనా వచ్చిందంటే వణికిపోయే పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు తెలిపారు. అక్షయ ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌ లో ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement