Malkangiri Suicide: భార్యకోసం ఖరీదైన ఫోన్ కొన్న భర్త! అతని ముందే పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ, ఫోన్‌ ఈఎంఐలో కొన్నందుకు పెద్ద గొడవ, కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన ఫోన్ ఈఎంఐ

భర్తతో గొడవకు దిగింది. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన జ్యోతి.. తన భర్త ముందే పురుగుల మందు తాగింది. దీంతో షాక్‌ గురైన కన్హై స్పృహతప్పిపడిపోయాడు. స్థానికులు ఇద్దరిని దవాఖానకు తరలించారు.

Representational Image (Photo Credits: File Image)

Malkangiri, OCT 20: భార్యకోసం ఖరీదైన ఫోన్ కొని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు భర్త. ఆ ఫోన్ చూసిన భార్య ఏం చేయాలి! ఎగిరి గంతేయాలి కానీ, ఆమె ఏం చేసిందో తెలుసా? ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. ఆ ఫోన్‌ ను ఈఎంఐలో (EMI) కొన్నాడని తెలిసి మసస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. భర్త సమక్షంలోనే బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఒడిశాలోని మల్కాన్‌గిరి (Malkangiri) జిల్లాలో చోటుచేసుకున్నది. జ్యోతి మండల్‌ (Jyothi mandal), కన్హై భార్యాభర్తలు. వీరిద్దరు ఏడాదిక్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరు మల్కాన్‌గిరి జిల్లాలోని ఎంపీవీ 14 గ్రామంలో నివాసముంటున్నారు. సరదాగా సాగుతున్న కొత్తకాపురంలో ఫోను చిచ్చుపెట్టింది. కన్హై.. ఓ ఖరీదైన ఫోన్‌ను (Costly Phone) జ్యోతికి గిఫ్ట్‌గా ఇచ్చాడు.

Haryana Shocker: పోలీసును చితకబాదిన యువకుడు, స్థానికులు రావడంతో పరార్, సోషల్ మీడియాలో వీడియో వైరల్ 

అయితే ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లిండం వీలుకాకపోవడంతో ఈఎంఐ రూపంలో నెలవారీగా చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఈఎంఐ కాస్తా ముగిసింది. దీంతో ఫైనాన్స్‌ (Finance) కంపెనీకి చెందిన అధికారులు కన్హై సంతకం కోసం వారింటికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆమె మనస్థాపానికి గురైంది.

Ludhiana Shocker: నచ్చిన కూర వండలేదని తల్లిని చంపేసిన కొడుకు, మొదటి అంతస్తు నుంచి తోచి దారుణంగా చంపేసిన కిరాతకుడు, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు 

తనకు ఈఎంఐలో కొన్న ఫోన్‌ను బహుమతిగా (Gift) ఇవ్వడం పట్ల నొచ్చుకున్నది. భర్తతో గొడవకు దిగింది. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన జ్యోతి.. తన భర్త ముందే పురుగుల మందు తాగింది. దీంతో షాక్‌ గురైన కన్హై స్పృహతప్పిపడిపోయాడు. స్థానికులు ఇద్దరిని దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమిండంతో జ్యోతి మరణించింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదుకానప్పటికీ.. పోలీసులు సుమోటోగా దర్యాప్తు ప్రారంభించారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య