haryana-traffic-police (Photo-Video Grab)

Ambala, Oct 19: హర్యానా అంబాల జిల్లాలో ఓ యువకుడు రెచ్చిపోయి తన కారు ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌ను (Man beats traffic cop) చితకబాదాడు. అంతటితో ఆగకుండా అతని చొక్కా చింపాడు. అక్టోబర్ 13న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో (Viral in Social Media) వైరల్‌గా మారింది. ట్రాఫిక్ పోలీస్ ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు (FIR registered) చేశారు పోలీసులు.ఈ యువకుడ్ని భటిండాకు చెందిన లావిష్‌ బత్రాగా గుర్తించారు. గాయపడ్డ ట్రాఫిక్ పోలీస్‌.. ఎక్సెంప్టీ సబ్ ఇన్‌స్పెక్టర్‌(ఈఎస్‌ఐ) అశోక్ కుమార్ అని తెలిపారు.

ఘటనకు ముందు రాజ్‌పుర్-అంబాలా రోడ్డులో అశోక్‌ కుమార్ తనిఖీలు నిర్వహిస్తున్నాడు. రెండు బైక్‌లను ఆపి పత్రాలు పరిశీలిస్తున్నాడు. ఈ సమయంలో ఓ ఎస్‌యూవీ వేగంగా రావడం చూసి ఆపాడు. అయితే దాన్ని డ్రైవ్ చేస్తున్న యువకుడు వాహనాన్ని నియంత్రించలేక ముందున్న రెండు బైక్‌లను ఢీకొట్టాడు. దీంతో వారు కిందపడి గాయాలపాలయ్యారు.

షాకింగ్ వీడియో, నిద్ర లేచిన వ్యక్తిని చెప్పుతో కొడుతూ కాలితో తన్నిన మహిళ, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్

వెంటనే కారులోనుంచి దిగిన యువకుడు ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదడమే గాక అతని దుస్తులు చింపాడు. స్థానికులు అక్కడికి గుంపులుగా రావడంతో భయపడి పారిపోయాడు. ఎస్‌యూవీని రోడ్డుపైనే వదిలిపెట్టాడు.

Here's Video

ఈ దృశ్యాలను అక్కడున్నవారు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అతడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.