Delhi Shocker: ఢిల్లీలో దారుణం, డబ్బులు ఇవ్వలేదని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేశాడు, మరో ఘటనలో మధ్య ప్రదేశ్‌లో ఐదేండ్లుగా మేన‌కోడ‌లిపై లైంగిక దాడి

ఢిల్లీలో దారుణం చోటు (Delhi Shocker) చేసుకుంది. ఆర్ధిక వివాదం ముద‌ర‌డంతో త‌న‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న యువ‌తిని దారుణంగా పొడిచిచంపిన ఘ‌ట‌న ద‌క్షిణ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో సోమ‌వారం వెలుగుచూసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి హ‌త్య చేసేందుకు వాడిన క‌త్తిని (Woman stabbed to death by live-in partner) స్వాధీనం చేసుకున్నారు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

New Delhi, May 11: ఢిల్లీలో దారుణం చోటు (Delhi Shocker) చేసుకుంది. ఆర్ధిక వివాదం ముద‌ర‌డంతో త‌న‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న యువ‌తిని దారుణంగా పొడిచిచంపిన ఘ‌ట‌న ద‌క్షిణ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో సోమ‌వారం వెలుగుచూసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి హ‌త్య చేసేందుకు వాడిన క‌త్తిని (Woman stabbed to death by live-in partner) స్వాధీనం చేసుకున్నారు.

మెహ్రౌలిలోని భగ‌వ‌తి ఆస్పత్రికి స‌మీపంలో మ‌హిళ క‌త్తిపోట్ల‌కు గురైంద‌నే స‌మాచారం రావ‌డంతో పోలీస్ పెట్రోలింగ్ వాహ‌నం అక్క‌డకు చేరుకుంది. ఆపై బాధితురాలిని ఎయిమ్స్ ట్రౌమా కేర్‌కు పోలీసులు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడు హ‌రీష్‌(20)ను ఘ‌ట‌నా స్ధ‌లంలో అరెస్ట్ చేశారు.బాధిత యువ‌తిని దుర్గా విహార్‌, ఖాన్‌పూర్‌కు చెందిన బీనా(19)గా గుర్తించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మ‌ర‌ణించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. యూపీలో దారుణం, పెళ్లికి ముందే యువతిపై గ్యాంగ్ రేప్, అనంతరం రాజకీయ నేతకు విక్రయించడంతో అతనూ రేప్ చేసి మరొకరికి విక్రయం

ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం వెలుగుచూసింది. మేన‌కోడ‌లు వ‌ర‌సైన మైన‌ర్ బాలిక‌పై ఐదేండ్లుగా లైంగిక దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి ఉదంతం రెవాలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అత‌డి మొబైల్ ఫోన్‌లో నుంచి బాలిక అభ్యంత‌ర‌క‌ర వీడియోల‌ను స్వాధీనం చేసుకున్నారు.బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన నిందితుడిని లాల‌న్ మిశ్రాగా గుర్తించారు. ఐదేండ్లుగా దారుణం జ‌రుగుతున్నా భ‌యంతో బాలిక ఈ విషయాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదు. నిందితుడి తీరుతో విసిగిన బాలిక చివ‌ర‌కు కుటుంబ‌స‌భ్యుల‌కు తెల‌ప‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాలిక‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చ‌ట్టం స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement