Alanganallur Jallikattu: ప్రారంభ‌మైన‌ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అలంగ‌నల్లూర్ జ‌ల్లిక‌ట్టు ఉత్స‌వాలు, క‌నుమ మ‌ర‌సటి రోజు జ‌రిగే పోటీల కోసం దేశ విదేశాల నుంచి ప్రేక్ష‌కులు

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు (Alanganallur Jallikattu Festival) బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ మరుసటి రోజు మధురై సమీపంలోని అలంగనల్లూర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.

Alanganallur Jallikattu (PIC@ ANI X)

Chennai, JAN 17: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు (Alanganallur Jallikattu Festival) బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ మరుసటి రోజు మధురై సమీపంలోని అలంగనల్లూర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ జల్లికట్టు  (Alanganallur Jallikattu Festival)ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తారు.

 

ఈ ఉత్సవాలను ప్రత్యక్షంగా వేల మంది వీక్షిస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి.. వాటిని లొంగదీసుకోవడం అనేది ఈ క్రీడలోని ప్రధానమైన అంశం. ఎద్దులను లొంగదీసుకునేందుకు యువకులు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు.

 

ఈ ఉత్సవంలో పలువురు తీవ్ర గాయాలపాలవుతుంటారు. అయినా ఈ ఉత్సవాలకు ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు.త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ఈ జ‌ల్లిక‌ట్టు ఉత్స‌వాల‌ను జెండాఊపి ప్రారంభించారు. పోటీల‌కు ముందు ఎద్దుల‌కు ఆరోగ్య ప‌రీక్ష‌లు చేశారు. ఉత్స‌వాల కోసం యువ‌త కూడా ఉత్సాహంగా సిద్ధ‌మ‌య్యారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement