YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా, బెయిల్‌ వ్యవహారాలు ఆచితూచి ఉంటాయని తెలిపిన సుప్రీంకోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా కీలకమైన అంశమని తెలిపిన ధర్మాసనం... వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది.

File image used for representational purpose | (Photo Credits: PTI)

New Delhi, July 18: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా కీలకమైన అంశమని తెలిపిన ధర్మాసనం... వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది.అలాగే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్‌ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ కూడా అదే రోజుకు వాయిదా వేసింది.

గంగిరెడ్డి పిటిషన్‌నూ అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌కు జత చేస్తూ.. సెప్టెంబర్‌ రెండో వారంలో విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుతోపాటు వివేకా హత్య కేసు వివరాలు, డైరీ సీల్డ్‌ కవర్‌లో అందించాలని సీబీఐని ఆదేశించింది. జూన్‌ 30న దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని సుప్రీంకోర్టు సూచించింది.

వివేకా హత్య కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన CBI, నిందితుల రిమాండ్‌ ను 14 రోజులు పొడిగించిన నాంపల్లి కోర్టు

గంగిరెడ్డికి వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలంటూ.. అతడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గంగిరెడ్డి న్యాయవాదిపై ధర్మాసనం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇది హత్య కేసు.. బెయిల్‌ వ్యవహారాలు ఆచితూచి ఉంటాయి. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. బెయిల్‌ కోసం వేచి చూడాల్సిందే’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌తో జతచేయొద్దన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గంగిరెడ్డికి జూన్ 30న బెయిల్‌ ఇవ్వాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఆ ఆదేశాలు కొనసాగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Share Now
Advertisement