Kejriwal Comments On BJP: సీబీఐ, ఈడీలను నాకు ఒక్కరోజు అప్పగిస్తే బీజేపీలో సగం మంది జైల్లో ఉంటారు.. ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చేతుల్లో ఉన్నాయని మండిపాటు

ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు ఇటీవల కాలంలో పెరిగిపోవడం పట్ల ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను 24 గంటల పాటు తనకు అప్పగిస్తే బీజేపీలోని సగం మంది నేతలు జైల్లో ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kejriwal File (Credits: Twitter/ANI)

Newdelhi, Nov 25: ఈడీ (ED), ఐటీ (IT), సీబీఐ (CBI) దాడులు ఇటీవల కాలంలో పెరిగిపోవడం పట్ల ఢిల్లీ సీఎం (Delhi CM), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను 24 గంటల పాటు తనకు అప్పగిస్తే బీజేపీలోని (BJP) సగం మంది నేతలు జైల్లో ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వేతన జీవులకు శుభవార్త.. వేతన సీలింగ్ సవరణకు ఈపీఎఫ్‌వో రెడీ.. వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచే యోచన.. 75 లక్షల మందికి లబ్ధి.. రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము

తమ నేతలు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా అవినీతిపరులని బీజేపీ చెబుతుందని, అవన్నీ అబద్దాలేనని ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చేతిలోనే ఉన్నాయని అన్నారు. తమకు వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టారని కేజ్రీవాల్ మండిపడ్డారు. మనీష్ సిసోడియా లిక్కర్ స్కాంలో రూ.10 కోట్లు తిన్నాడని అంటున్నారని, వారి చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థల సాయంతో ఆ విషయం నిరూపించవచ్చు కదా? అని నిలదీశారు.

భారతీయ ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్, నవంబర్ 30 లోపు కంపెనీని వదిలేయాలని ఆదేశాలు, కంపెనీ అందించే బెనిఫిట్స్ తీసుకుని రిజైన్ చేయాలని సూచన

ఆప్ నేతలపై 200 కేసులు నమోదు చేసినా, ఒక్కటీ నిరూపించలేకపోయారని స్పష్టం చేశారు. 150 కేసుల్లో తమ నేతలకు క్లీన్ చిట్ వచ్చిందని, మిగిలిన కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ పై వ్యాఖ్యలు చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement