Nitish Meets PK: విపక్ష కూటమిలోకి బీహార్ సీఎం నితీష్‌? బీహార్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రశాంత్ కిషోర్ తో సీఎం నితీష్ భేటీ, రెండు గంటల పాటూ సుదీర్ఘంగా చర్చించిన పాత మిత్రులు

రెండేళ్ల క్రితం విడిపోయిన పాత స్నేహితుడ్ని సడెన్ గా కలిశారు బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar). ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ( Prashant Kishor ) రెండు గంటల పాటూ సుధీర్ఘంగా చర్చించారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.

Baat Bihar Ki: Nitish kumar vs prashant kishor (Photo-FB/ANI)

Patna, Feb 19 : రెండేళ్ల క్రితం విడిపోయిన పాత స్నేహితుడ్ని సడెన్ గా కలిశారు బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar). ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ( Prashant Kishor ) రెండు గంటల పాటూ సుధీర్ఘంగా చర్చించారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు (Nitish Meets PK). రెండేళ్ల క్రితం జనతాదళ్‌(యునైటెడ్‌) (JDU) పార్టీ నుంచి పీకేను తప్పించిన తర్వాత వీరిద్దరూ భేటీ అవడం ఇదే తొలిసారి. పాత అనుబంధాల కారణంగానే (courtesy visit) పీకే (PK)తో తాను సమావేశమైనట్లు నితీశ్ కుమార్‌ మీడియాకు తెలిపారు. అటు పీకే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘నితీశ్‌జీ కరోనా బారిన పడినప్పుడు నేను ఫోన్‌ చేసి పరామర్శించారు. ఆ సమయంలో నన్ను కలవాలనుకుంటున్నట్లు నితీశ్‌ చెప్పారు. అందుకే నేడు మర్యాదపూర్వకంగా కలిశాను’’ అని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. అయితే రాజకీయాల అంశాన్ని ఇద్దరూ కొట్టిపారేయ్యలేదు. దీంతో వీరి భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

UP Elections: వారికోసం బల్డోజర్లు సిద్ధం చేస్తున్నాం, యూపీ సీఎం కీలక వ్యాఖ్యలు, మార్చి 10 తర్వాత సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్, ఎస్పీ-బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం, హీటెక్కిన ఎన్నికల ప్రచారం

2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేయాలన్న ప్రణాళికలో ఉన్న పీకే.. నితీశ్‌ను కలవడం వెనుక ఏదో ఆంతర్యం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జేడీయూ నుంచి వైదొలిగినప్పటికీ నితీశ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని పీకే పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. అంతేగాక, నితీశ్‌తో కలిసి మళ్లీ పనిచేయాలని కూడా అనుకుంటున్నట్లు తెలిపారు. అటు బిహార్‌లో (Bihar) నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. నితీశ్‌కు కూడా పీకే అవసరం చాలానే ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ భేటీ ద్వారా బీజేపీకి నితీశ్ గట్టి సందేశం ఇవ్వాలని భావించినట్లు బిహార్‌ సీఎం సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. 2020 బిహార్‌ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ.. ఎన్డీయే కూటమి నితీశ్‌ను సీఎంగా ఎంచుకుంది. అయితే ఈ మధ్య నితీశ్‌తో బీజేపీకి మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య చాలా సందర్భాల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా నితీశ్‌ వ్యాఖ్యలు చేశారు.

Nitish Kumar Covid: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కరోనా, ఆయన నివాసంలో 11 మందికి కోవిడ్, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో బీహార్ ముఖ్యమంత్రి

2018 సెప్టెంబరులో పీకే.. జేడీయూ పార్టీలో చేరారు. నితీశ్‌ ఆయనను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే కొద్ది రోజులకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 2020లో పీకేను జేడీయూ నుంచి బహిష్కరించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement