Lucknow, Feb 18: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Assembly elections) ఎస్పీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరికి ఒకరు వార్నింగ్స్ ఇచ్చుకుంటున్నారు నేతలు. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ముగియగా...త్వరలోనే మూడో దశ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. దీనికోసం ప్రచారం ఊపందుకుంది. అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ (Election Campaign) లో సీఎం యోగి ఆదిత్యానాథ్ (CM Yogi Adithyanath)సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు (Bulldozer) పని చెబుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఒకరు.. నేరస్థుల అక్రమాస్తులను కూల్చివేసేందుకు యూపీ ప్రభుత్వం గతంలో బుల్డోజర్లను ఉపయోగించింది. ఎన్నికల సమయంలోనూ బుల్డోజర్లను అలా ఉపయోగించగలదా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మెయిన్‌పురీ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి కీలక వ్యాఖ్యలు చేశారు.
#WATCH | I have come here to assure you that I have send the bulldozer for repair. 10 March ke baad jab ye fir se chalna prarambh hoga to jin logo me abhi jyada garmi nikal rahi hai, ye garmi 10 March ke baad apne aap shant ho jayegi: UP CM Yogi Adityanath in Karhal, Mainpuri pic.twitter.com/hvjcQsKbeE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 18, 2022
కొన్నిసార్లు బుల్డోజర్లకు కూడా విశ్రాంతి అవసరం. ప‍్రస్తుతం రాష్ట్రంలోని బుల్డోజర్లన్నింటిని (Bulldozer) రిపేర్ కోసం పంపించామన్నారు. బుల్డోజర్ల విషయంలో చింతించాల్సిన పని లేదు. గత నాలుగున్నరేళ్లుగా దాక్కున్న కొందరు వ్యక్తులు ఎన్నికల ప్రకటన వెలువడగానే బయటకు వస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించి మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పనిచెబుతామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయాలనే ఆలోచన ఉన్న వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని యోగి హెచ్చరించారు.
ఇప్పటికే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొద్ది రోజుల క్రితం బుల్డోజర్ల అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.యూపీలో ఉండాలంటే యోగీకి ఓటు వేయాల్సిందేన్నారు. ఓటు వేయని వారు యూపీ నుంచి వెళ్లిపోవాలని వీడియోలో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా బీజేపీకి ఓటు వేయని వారి కోసం జేసీబీలు, బుల్డోజర్లు సిద్దంగా ఉన్నాయని వ్యాఖ‍్యలు చేయడం తీవ్ర దుమారాన్ని సృష్టించింది. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా నోటీసు పంపించింది. తాజాగా యూపీ సీఎం నోటి నుంచి కూడా బుల్డోజర్ల మాట రావడం చర్చనీయాంశంగా మారింది.