Girl friend Shopping: భర్త ఆరోగ్యంగా ఉండాలని పండుగ పూట రోజంతా ఉపవాసం ఉంది ఆ మహా ఇల్లాలు.. ఐతే, గాళ్‌ఫ్రెండ్‌తో షాపింగ్ చేస్తూ భార్య కంట పడ్డాడు ఆ పురుష పుంగవుడు.. తర్వాత సీన్ ఏమైందంటే??
ఓ భర్త తన భార్యకు అడ్డంగా బుక్ అయ్యాడు. గాళ్‌ఫ్రెండ్‌తో షాపింగ్ చేస్తూ భార్య కంట పడ్డాడు. అంతే.. ఆ భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తపై విరుచుకుపడింది.
NewDelhi, October 14: భర్త (Husband) ఆరోగ్యంగా ఉండాలని పండుగ పూట రోజంతా ఉపవాసం (Fasting) ఉంది ఆ మహా ఇల్లాలు (Wife).. ఐతే, గాళ్‌ఫ్రెండ్ (Girl Friend)తో షాపింగ్ (Shopping) చేస్తూ భార్య కంట పడ్డాడు ఆ పురుష పుంగవుడు.. తర్వాత సీన్ ఏమైందంటే?? కర్వా చౌత్.. ఈ పర్వదినాన్ని ఉత్తరాది మహిళలు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. భర్త ఆరోగ్యంగా ఉండాలని రోజంతా ఉపవాసం ఉండి, చీకటి పడిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహిళలు ప్రత్యేకంగా భావించే కర్వా చౌత్ (Karwa Chauth) పర్వదినాన.. ఓ భర్త తన భార్యకు అడ్డంగా బుక్ అయ్యాడు. గాళ్‌ఫ్రెండ్‌తో షాపింగ్ చేస్తూ భార్య కంట పడ్డాడు. అంతే.. ఆ భార్య ఆగ్రహంతో ఊగిపోయింది.
భర్తపై విరుచుకుపడింది. స్నేహితుల సహాయంతో నోడీ రోడ్డుపై కాలర్ పట్టుకుని భర్త చెంపలు చెల్లుమనిపించింది. అనంతరం తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అదికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకోగా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.