Astrology: అక్టోబర్ 23న కుజ గ్రహం స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రం లోనికి ప్రవేశం దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం..

అయితే ఈ కుజ గ్రహం అక్టోబర్ 23న సాయంత్రం నాలుగు గంటలకు స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి మేదస్సు ప్రసంగం, రచన ,వ్యాపారం కమ్యూనికేషన్ రంగాలలో ప్రసాదించే గ్రహంగా చెప్పవచ్చు. అయితే ఈ కుజ గ్రహం అక్టోబర్ 23న సాయంత్రం నాలుగు గంటలకు స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహరాశి- సింహరాశిలో జన్మించిన వారికి కుజ గ్రహం విశాఖ నక్షత్రంలోనికి సంచరించడం కారణంగా అనేక మంచి ఫలితాలు వస్తాయి. వీరు ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. దీనిలో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. దీని వల్ల ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. ఇది సంపదాన్ని పెంచుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. దీని వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉంటారు.

Vastu Tips: తులసి మొక్కను ఈ ఒక్క రోజు మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి ...

వృశ్చిక రాశి- వృశ్చిక రాశిలో జన్మించిన వారికి పూజ గ్రహం నక్షత్ర మార్పు కారణంగా అన్ని సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి మీరు కోరుకున్నచోట బదిలీలు అవుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు లాభాన్ని ఇస్తాయి .డబ్బు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. రిటైల్ వ్యాపారులకు కస్టమర్ల వృద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

మిథున రాశి- మిథున రాశి వారికి కుజ గ్రహం నక్షత్రం మార్పు కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది .ఆదాయం పెరుగుతుంది. మీ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార భాగస్వాములు వస్తారు. దీని ద్వారా డబ్బు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా విజయవంతం అవుతాయి. కొత్త ప్రాజెక్టు పనులకు అవకాశాలు లభిస్తుంది. సంప్రదాయం సంపద వృద్ధి చెందుతుంది. పాత అప్పులు తీర్చడంలో విజయం పొందుతారు. ఆరోగ్యంపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.