Dhanteras 2023 Wishes: ధన త్రయోదశి పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకు Messages, Quotes రూపంలో శుభాకాంక్షలు తెలపండి..

ధన్తేరస్ రోజున ప్రజలు లక్ష్మీ దేవిని అలాగే కుబేరుని పూజిస్తారు.

ఈ సంవత్సరం ధంతేరస్ పండుగ 10 నవంబర్ 2023న జరుపుకుంటారు. ధన్తేరస్ రోజున ప్రజలు లక్ష్మీ దేవిని అలాగే కుబేరుని పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, సముద్ర మథనం సమయంలో, ధన్వంతరి తనతో పాటు అమృతం ,ఆయుర్వేదాన్ని ప్రపంచానికి అందిస్తూ ఈ పర్వదినం రోజున కనిపించాడు. భగవంతుడు ధన్వంతరిని వైద్య పితామహుడు అని కూడా అంటారు. ధన్‌తేరస్‌లో షాపింగ్ చేసే సంప్రదాయం కూడా ఉంది. బంగారం, వెండి ఆభరణాలు, పాత్రలు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. దీనితో పాటు, ధన్తేరస్ రోజున ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేయడం శుభప్రదం. ధన్‌తేరస్ పండుగ శుభప్రదంగా ఉండాలని అందరికీ సంతోషాన్ని కలిగించాలని కోరుతూ ప్రజలు తమ ప్రియమైన వారికి శుభాకాంక్షలు కూడా పంపుతారు. ఈ ఆకర్షణీయమైన వాల్‌పేపర్‌ల ద్వారా మీరు ఈ ధన్‌తేరస్‌కు శుభాకాంక్షలు పంపవచ్చు...

ధన్తేరస్ పవిత్రమైన రోజు

లక్ష్మీ-గణపతి ఆశీర్వాదంతో,

మీ కుటుంబంపై ఆనందపు నీడ ఉంటుంది.

ఈ ధన త్రయోదశి సిరిసంపదలతో, ధాన్యాలతో నిండి ఉండుగాక.. మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్‌తేరాస్‌ శుభాకాంక్షలు

Dhanteras Wishes in Telugu

మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, మీ కుటుంబంలో

ప్రేమ, ఆప్యాయత నిలిచి ఉండాలని

మీరు ఎల్లప్పుడూ సంపదలతో నిండి ఉండాలని,

మీ ధన్తేరస్ పండుగ ఇలాగే ఉండాలని

కోరుకుంటున్నాను.ధన్తేరస్ శుభాకాంక్షలు.

Dhanteras Wishes in Telugu (2)

మీ ఇంట్లో సంపదల వర్షం కురవాలని,

ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలని,

మీ తలపై ప్రగతి కిరీటం నెలకొనాలని,

ఇంట్లో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాను.

Dhanteras Wishes in Telugu (1)

మీ ఇంట్లో సంపదల వర్షం కురవాలని,

శాంతి నెలకొనాలని,

కష్టాలు తీరాలని,

లక్ష్మీ దేవి నివసించాలని,

ధన్తేరస్ పండగ శుభాకాంక్షలు