Happy Diwali 2019 Wishes: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే దీపావళి, మీ నుంచి మీ తర్వాత తరం కూడా కొనసాగేలా ఘనంగా జరుపుకోండి. దీపావళి శుభాకాంక్షలను తెలిపే WhatsApp Stickers, SMS, Image Messages, Quotes కోసం ఇక్కడ చూడండి
ఈ దీపావళిని మీరు, మీ కుంటుబ సభ్యులు మరియు ఆత్మీయులతో కలిసి ఆనందంగా జరుపుకోండి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మీ నుంచి మీ తర్వాత తరం కూడా కొనసాగేలా ప్రతీ ఒక్కరిని ఈ ఉత్సవంలో భాగస్వామ్యం చేయండి....
Happy Diwali Wishes in Telugu: భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే వెలుగుల పండుగ దీపావళి. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈ దీపాల పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. లోక కంటకుడై, అధర్మకృత్యాలు చేస్తున్న నరకాసురుడనే రాక్షసుడిని అరికట్టడానికి శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా తరలి వెళ్లి నరకాసుర వధ చేస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అతడి పీడ వదిలి అంటే అధర్మం ఓడిపోయి ధర్మం గెలిచిందనే ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని ప్రతీతి. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినాన ప్రతి ఇల్లు దివ్యమైన దీపాల వెలుగుల శోభతో దేదీప్యమానంగా వెలుగొందుతుంది.
హిందూ పండగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. దీపావళి రోజున మహాలక్ష్మీని త్రికరణశుద్ధితో ఆరాధించడం ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయని, సర్వసంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం. ఈరోజున లక్ష్మీదేవిని కొలిస్తే విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు విద్యను కోరితే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరితేక ధనలక్ష్మీగా, సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని పురాణాల్లో రాసి ఉంది.
ఈ దీపావళిని మీరు, మీ కుంటుబ సభ్యులు మరియు ఆత్మీయులతో కలిసి ఆనందంగా జరుపుకోండి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మీ నుంచి మీ తర్వాత తరం కూడా కొనసాగేలా ప్రతీ ఒక్కరిని ఈ ఉత్సవంలో భాగస్వామ్యం చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు మరియు ఇతర శ్రేయోభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేయండి. కింది ఇవ్వబడిన దీపావళి శుభాకాంక్షలు, వాట్సాప్ స్టిక్కర్లు, ఎస్ఎంఎస్ మరియు ఫేస్బుక్ సందేశాలు మీ ప్రియమైన వారికి పంపడం ద్వారా వారిని ఈ పండగ రోజున ఆనందపరచడమే కాకుండా మీ పండగ ఉత్సాహాన్ని, మీ కుటుంబంలో సంతోషాలను రెట్టింపు చేస్తాయని ఆశిస్తున్నాం.
WhatsApp Message Reads:
ఈ దీపావళి కాంతుల ప్రకాశం,
మీ జీవితంలో నింపాలి వెలుగుల వికాసం,
మీ ఇంటికి కలగాలి ఆ లక్ష్మీదేవీ కటాక్షం,
ఈ పండగతో మీ కుటుంబంలో వెల్లివిరియాలి సంతోషం.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
WhatsApp Message Reads:
తారలు దిగివచ్చినట్లుండే దీపాల వరుసలు
తారాజువ్వలు చీల్చే అమావాస్య చీకట్లు
ఇంటిని ధగధగ మెరిపించే ధనరాశులు
జీవితాలను వెలిగించనీ ఈ దీపాల పండుగ వెలుగులు
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
WhatsApp Message Reads:
దీపకాంతుల జ్యోతులతో
సిరిసంపదల రాశులతో
పటాకుల వెలుగులతో
ఆనందంగా జరుపుకోండి వెలుగు జిలుగుల దీపావళి
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
WhatsApp Message Reads:
మిరుమిట్లు గొలిపే దీపాలతో,
వెలుగులు విరజిమ్మే టపాసులతో,
మధురమైన మిఠాయిలతో,
ఈ పండుగ మీకు ఎన్నో మధురానుభూతులు అందించాలని కోరుకుంటూ..
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
WhatsApp Message Reads:
అజ్ఞాన చీకట్లను పారదోలి,
జ్ఞాన జ్యోతులు వెలిగించే దీపాల పండుగే ఈ దీపావళి
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయ పూర్వకమైన దీపావళి శుభాకాంక్షలు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)