Gandhi Jayanti 2024 Wishes In Telugu: పూజ్య బాపూజీ గాంధీ జయంతి సందర్భంగా మీ స్నేహితులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..

గాంధీజీ అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారిపై పోరాడి భారతదేశానికి స్వతంత్రం అందించారు, అందుకే ప్రతి సంవత్సరం ఆయన జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. గాంధీజీ అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారిపై పోరాడి భారతదేశానికి స్వతంత్రం అందించారు, అందుకే ప్రతి సంవత్సరం ఆయన జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆయన నిరంతర కృషిని గుర్తు చేసుకుంటారు. అహింస, సత్యం అనే సూత్రాలకు బాపు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. గాంధీజీ సత్యాగ్రహం మరియు అహింస ద్వారా భారతదేశానికి స్వాతంత్రం అందించారు. అతను భారతదేశం యొక్క గొప్ప స్వాతంత్ర సమరయోధులలో ఒకరు, నాయకుడు, తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త. ఆయన 155వ జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి.

సత్య మేవ జయతే..గాంధీ జయంతి శుభాకాంక్షలు.. జాతిపితగా కీర్తిగాంచిన ఓ మహాత్మా అమరం నీ స్ఫూర్తి, అజరామరం నీ ఖ్యాతి.

సాధనలేకుండా విజయాన్ని కాంక్షించడం ఎండమావిలో నీటికై ఆశించడమే - మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు.

సత్యం, అహింస అనే ఆయుధాలను చేసుకున్న మహనీయుని జీవితం కేవలం సందేశం మాత్రమే కాదు మనందరికీ దిక్సూచి కూడా.. మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు

అహింసా అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు, యావత్ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత, జాతిపిత మహాత్మ గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ గాంధీ జయంతి శుభాకాంక్షలు

అహింసే తన ఆయుధంగా... సత్యమే తన శక్తిగా.. చేతిలో భగవద్గీతతో దేశానికి ఊతకర్రయై నిలిచి... ఆంగ్లేయులను ఎదిరించి, భారతమాత సంకెళ్లను త్రెంచిన మహాత్మా గాంధీని స్మరించుకుంటూ గాంధీ జయంతి శుభాకాంక్షలు.

మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయన పాటించిన శాంతి, అహింస, సత్య సిద్ధాంతాలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని కోరుకుంటూ, వారికి నా ఘన నివాళులు.