Makar Sankranti Wishes: మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధువులకు, స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో
మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
Makar Sankranti Wishes in Telugu: మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. పండుగ విషెస్, కోటేషన్స్, మెసేజెస్ మీకోసం..
ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు
భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో సుఖశాంతులతో ఉండాలని అందరికీ లేటెస్ట్‌లీ తరపున భోగి పండుగ శుభాకాంక్షలు