
మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2023 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.
సంక్రాంతి లేదా సంక్రమణము- అంటే "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మీ స్నేహితులకు, బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా..

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

మీకు మీ బంధు మిత్రులకు,
కుటుంబ సభ్యులకు
సంక్రాంతి శుభాకాంక్షలు

చెరకులోని తీయదనం..
పాలలోని తెల్లదనం..
గాలిపటంలోని రంగుల అందం..
మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

కళకళలాడే ముంగిట రంగవల్లులు..
బసవన్నల ఆటపాటలు..
మీకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

భోగ భాగ్యాల ఈ సంక్రాంతి
అందరి ఇంట కలల పంట
పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

భోగ భాగ్యాలనిచ్చే భోగి,
సరదానిచ్చే సంక్రాంతి,
కమ్మని కనుమ,
కొత్త వెలుగులను
నింపాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు
భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో సుఖశాంతులతో ఉండాలని అందరికీ లేటెస్ట్‌లీ తరపున భోగి పండుగ శుభాకాంక్షలు