Horoscope Today 18 May 2022: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

Horoscope Today 18 May 2022: కొన్ని రాశుల వారు బుధవారం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బుధవారం నాడు, సింహ రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. మరోవైపు, తుల రాశి వారు తమ అవగాహనతో అన్ని విషయాలను పరిష్కరించుకోవాలి.

horoscope

Horoscope Today 18 May 2022:  కొన్ని రాశుల వారు బుధవారం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బుధవారం నాడు, సింహ రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. మరోవైపు, తుల రాశి వారు తమ అవగాహనతో అన్ని విషయాలను పరిష్కరించుకోవాలి.

మేషం:

చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

వృషభం

కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.

మిధునం

ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

జ్ఞాన్‌వాపి మ‌సీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, శివలింగాన్ని రక్షించండి.. నమాజ్‌కు అనుమతించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు, తదుపరి విచారణను మే 19కి వాయిదా

కర్కాటకం

ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

సింహం

బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు.

కన్య

కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి పాత మిత్రుల నుండి శుభ కార్య ఆహ్వానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల

అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలొ వాహన ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

ధనస్సు

ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకరం

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం.

కుంభం

సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

మీనం

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement