Ugadi 2023: దుర్గా మాత భక్తులు మార్చి 22 నుంచి 30వ తేదీ వరకూ వీటిని తినకుండా జాగ్రత్తగా ఉంటే, జీవితంలోని కష్టాలు, అప్పులు, బాధలు పోయి సుఖంగా ఉంటారు.
ఈ సంవత్సరం చైత్ర నవరాత్రులు మార్చి 22 న ప్రారంభమవుతాయి తొమ్మిది రోజుల ఉత్సవాల్లో చివరి రోజు మార్చి 30 న రామ నవమితో ముగుస్తుంది. చైత్ర నవరాత్రులు దేశవ్యాప్తంగా దుర్గా మాత భక్తులు తొమ్మిది రోజుల పండుగగా జరుపుకుంటారు.
చైత్ర నవరాత్రి సాధారణంగా చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటారు . ఈ సంవత్సరం చైత్ర నవరాత్రులు మార్చి 22 న ప్రారంభమవుతాయి తొమ్మిది రోజుల ఉత్సవాల్లో చివరి రోజు మార్చి 30 న రామ నవమితో ముగుస్తుంది. చైత్ర నవరాత్రులు దేశవ్యాప్తంగా దుర్గా మాత భక్తులు తొమ్మిది రోజుల పండుగగా జరుపుకుంటారు.
ముహూర్తం, పూజ సమయం
ఈ సంవత్సరం, చైత్ర ప్రతిపద తిథి 21 మార్చి 2023న రాత్రి 10.52 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 22 మార్చి 2023 రాత్రి 8:20 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, నవరాత్రులు 22 మార్చి 2023న ప్రారంభమవుతాయి. ఘట స్థాపన లేదా కలశ స్థాపన శుభ ముహూర్తం 22 మార్చి 2023న ఉదయం 6:29 నుండి 07:39 వరకు. మొత్తం వ్యవధి: 1 గంట 10 నిమిషాలు
నవరాత్రులలో భక్తులు ఉపవాసాలు పాటిస్తారు. నవరాత్రి ఉపవాస సమయంలో అన్ని ఆహారాలు అనుమతించబడవు. ఉపవాస సమయంలో సాత్విక ఆహారాలు మాత్రమే తీసుకుంటారు. తామస ఆహారాలకు దూరంగా ఉంటారు. అయితే, కొన్ని మసాలా దినుసుల వాడకంతో ఉపవాసానికి అనుకూలమైన ఆహారాలు రుచికరంగా ఉంటాయి. చైత్ర నవరాత్రులలో ఏయే ఆహారపదార్థాలు తినవచ్చు, తినకూడదు అనేది చూద్దాం.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎన్ని ద్వారాలు ...
నవరాత్రులలో తినకూడని ఆహారాలు
ఉల్లిపాయలు, వెల్లుల్లి, గోధుమ పిండి, బియ్యం, బెండకాయలు, పుట్టగొడుగులు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, ఇంగువ, ఆవాలు, మెంతులు. అంతేకాకుండా, ఈ సందర్భంలో ఉప్పును వినియోగించకూడదు.
నవరాత్రులలో మీరు తినాల్సిన ఆహారాలు
ఉపవాస సమయంలో మీ శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచడానికి ఆరోగ్యకరమైన పండ్లు మరియు కూరగాయలను చేర్చడానికి ప్రయత్నించాలి. సాబుదాన, బంగాళదుంప, బత్తాయి, పొట్లకాయ, పాలకూర, గుమ్మడికాయ, క్యారెట, దోసకాయలు, జీలకర్ర పొడి, నల్ల మిరియాల పొడి, పచ్చి ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అజ్వాన్, నల్ల మిరియాలు, కోకుమ్, జాజికాయ.