Independence Day Wishes in Telugu: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. గుండెల్లో దేశభక్తిని నింపే మహోన్నత పర్వదినం.. 80వ ఇండిపెండెన్స్ డే బెస్ట్ కొటేషన్స్ మీకోసం..

మన కోసం నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వారు ఉన్నారు.. మన కోసం కుటుంబాలను వదిలి సరిహద్దుల్లో నిలిచిన వారు ఉన్నారు.. వారి త్యాగాల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారిని ఒక్కసారి స్మరించుకోవడం కాదు.. వారి త్యాగాలకు తగిన భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం

Independence-Day-Wishes 9.jpg

Independence Day Wishes in Telugu: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం.. కోట్లాది భారతీయుల స్వేచ్ఛకు ప్రతీక.. మన గుండెల్లో దేశభక్తిని నింపే మహోన్నత పర్వదినం.. స్వాతంత్ర్య దినోత్సవం. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన భారతదేశం ప్రతి ఏటా ఈ రోజును అత్యంత ఘనంగా జరుపుకుంటుంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడే వేళ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను దేశం స్మరించుకుంటుంది. ఇది కేవలం ఒక పండుగ కాదు.. మన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యతను, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్రను గుర్తుచేసే పవిత్రమైన రోజు.

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ..ఈ ప్రత్యేకమైన కోట్స్ ద్వారా అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

మన కోసం నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వారు ఉన్నారు.. మన కోసం కుటుంబాలను వదిలి సరిహద్దుల్లో నిలిచిన వారు ఉన్నారు.. వారి త్యాగాల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారిని ఒక్కసారి స్మరించుకోవడం కాదు.. వారి త్యాగాలకు తగిన భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.  ఆగస్టు 15 సందర్భంగా దేశభక్తి కోటేషన్స్

Independence-Day-Wishes 5.jpg

దేశం కోసం సరిహద్దుల్లో సైనికుడు కాపలా కాస్తే.. దేశ నిర్మాణం కోసం మనం మన బాధ్యతను నిర్వర్తించాలి. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Independence-Day-Wishes 6.jpg

కులం కాదు.. మతం కాదు.. ప్రాంతం కాదు.. ముందుగా మనమంతా భారతీయులం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Independence-Day-Wishes 7.jpg

దేశం మనకు ఏమిచ్చిందని అడగకండి.. దేశం కోసం మనం ఏమి చేస్తున్నామో మనల్ని మనమే ప్రశ్నించుకుందాం.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Independence-Day-Wishes 8.jpg

అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మాత్రమే కాదు.. వారు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడమే నిజమైన నివాళి.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Independence-Day-Wishes 9.jpg

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement