Kamada Ekadashi 2024: కామద ఏకాదశికి సంబంధించిన పురాణ కథ ఇదిగో, శ్రీకృష్ణుడు యుధిష్టరునికి చెప్పిన ఏకాదశి మహత్యం విశిష్టత గురించి తెలుసుకోండి

ఇది చైత్ర మాసం శుక్ల పక్షం రోజున వస్తోంది. ఈ రోజున ఉదయాన్నే స్నానమాచరించి పరిశుభ్రమైన దుస్తులు ధరించి లక్ష్మీనారాయణులను పూజించాలి. వ్రతం ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖసంతోషాలు కలుగుతాయని ప్రతీతి.

Kamada-Ekadashi

ఈ సంవత్సరం ఏప్రిల్ 19న కామద ఏకాదశి, దమన ఏకాదశి జరుపుకోనున్నారు. ఇది చైత్ర మాసం శుక్ల పక్షం రోజున వస్తోంది. ఈ రోజున ఉదయాన్నే స్నానమాచరించి పరిశుభ్రమైన దుస్తులు ధరించి లక్ష్మీనారాయణులను పూజించాలి. వ్రతం ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖసంతోషాలు కలుగుతాయని ప్రతీతి.

ఏకాదశి తిథి ఏప్రిల్ 18న సాయంత్రం 5.31 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 19 రాత్రి 8.04 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రకారం 19 వ తేదిన వ్రతం ఆచరించాల్సి ఉంటుంది. 20 ఏప్రిల్ రోజున ఉదయం 05.50 నుంచి 08.26 మధ్య  వ్రతాన్ని ముగించాలి. ఈ రోజున పితృ దేవతలకు నైవేద్యం, కోరికలు ఈడేరేందుకు, ఆర్థిక లాభం నెరవేరేందుకు వేర్వేరు రీతుల ఆరాధనలు చేయడం జరుగుతుంది. నియమనిబంధనలు తెలుసుకుని వాటిని ఆచరించాలి. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతాయని పురాణాలు చెబుతున్నాయి.

కామద ఏకాదశికి సంబంధించిన పురాణ కథ ఒకటి ఉంది. వరహ పురాణం ప్రకారం శ్రీ కృష్ణ పరమాత్ముడు యుధిష్టరునికి కామద ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు. వశిష్ట మహాముని, దిలీప రాజుకి ఏకాదశి వ్రత కథను వివరించాడు. ఆ పురాణ కథ ప్రకారం…పూర్వం భోగిపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడనే రాజు పాలిస్తుండే వాడు. ఆయన సభలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు నృత్య గానాలతో అలరించేవారు. కాగా ఒక రోజున సభలో లలిత్ అనే గంధర్వుడు సభలో గానాలాపన చేశాడు.

అయితే ఆ సమయంలో అతడికి తన భార్య లతిత గుర్తుకొస్తుంది. దాంతో అతడి స్వరం, తాళం పట్టు తప్పుతాయి. దీనిని కర్కటకుడు అనే సర్పరాజు గ్రహించి విషయాన్ని రాజుకు తెలుపుతాడు. రాజు ఆగ్రహించిన అతడి అందం, సృజానాత్మకత, కళ నాశనమైపోవాలని, రాక్షసుడయిపొమ్మని శపిస్తాడు. చూస్తుండగానే ఆ గంధర్వుడు భయంకర రూపంలోకి మారిపోతాడు. అతడి భార్య దు:ఖించి భర్తను తీసుకుని అడవుల్లోకి వెళ్లిపోతుంది. కామద ఏకాదశి రోజున ఈ పనులు చేస్తే శ్రీకృష్ణుడి ఆగ్రహానికి గురవుతారు, ఆ రోజున చేయవలసినవి, చేయకూడని పనులు ఏంటో తెలుసుకోండి

వింద్యాచల అడవులలో వారికి శ్రింగి ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి లలితుడి భార్య లలిత శ్రింగి మహార్షితో జరిగిన కథ వివరిస్తుంది. పరిష్కార మార్గం చూపమని కోరుతుంది. దాంతో శ్రింగి మహార్షి ఆమెకు కామద ఏకాదశి మహాత్యాన్ని గురించి వివరిస్తాడు. ఆ కథ విన్న గంధర్వుడి భార్య భక్తిశ్రద్ధలతో ఉపవాసం, వ్రతం ఆచరించి వాసుదేవ భగవానుని వేడుకుంటుంది. ఆ తర్వాత ప్రక్కనే ఉన్న భర్తను చూడగా అతడి పూర్వ రూపం తిరిగొస్తుంది. చివరకు వారు మోక్షం పొందుతారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif