Happy Kanuma 2023 Wishes: మూడు రోజుల సంక్రాంతి సంబరం, ఏడాదంతా జ్ఞాపకం. రైతన్నల నేస్తాలకు 'పసందైన విందు'తో జరుపుకునే పండగే కనుమ. తెలుగు సంస్కృతి- సంప్రదాయాలకు అద్ధంపట్టేలా, కనుమ పండగ విశిష్టత తెలిపే సందేశాలు, కనుమ శుభాకాంక్షలు Kanuma Subhakankshalu Images, Kanuma Quotes, Kanuma Telugu Greetings కోసం ఇక్కడ చూడండి

కనుమ గొప్పదన్నాన్ని, విశిష్టతను, తెలుగు సాంప్రదాయాలను తెలిపే ఈ సందేశాలు...

కనుమ శుభాకాంక్షలు

Happy Kanuma 2023 Telugu Wishes: సంక్రాంతి (Sankranthi) పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఏడాదికాలంగా తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు.

కనుమరోజు అడవిలో దొరికే వివిధ వనమూలికతో కూడిన మిశ్రమాన్ని పశువులకు తినిపిస్తారు. దీనిని ఉప్పుచెక్క అని కూడా అంటారు. ఏడాది కొకసారి పశువులకు ఉప్పుచెక్కను తినిపిస్తే అది వాటికి సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని రైతుల నమ్మకం.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తీసుకెళ్లి, వాటికి శుభ్రంగా స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను రంగులు అద్దుతూ, ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలతో అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలి వేసి వాటికి విశ్రాంతినిస్తారు.

సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు. వచ్చే ఏడాదిలో కూడా పాడిసంపద వృద్ధి చెంది, పంటలు సమృద్ధిగా పండితే మరింత ఘనంగా పూజలు చేస్తామని కాటమరాజుకు యాటలు కోసి మొక్కులు సమర్పించుకుంటారు. కనుమ రోజు ఇంట్లో పసందైన మాంసాహార వంటకాలు వండుతారు. కుటుంబ సభ్యులు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం కనుమను ఘనంగా జరుపుకుంటారు.

ఇక సంక్రాంతి ముగింపు వేడుకలుగా చెప్పబడే ఈ కనుమ పర్వదినాన్ని మీ కుటుంబ సభ్యులంతా కలిసి గొప్పగా జరుపుకోవాలని, ఈ సంక్రాంతి వేడుకలు ఏడాదికి సరిపోయే మధుర జ్ఞాపకాలు మిగిల్చాలని ఆకాంక్షిస్తూ కనుమ శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, సోషల్ మీడియా స్టేటస్ లు అందిస్తున్నాం. కనుమ గొప్పదన్నాన్ని, విశిష్టతను, తెలుగు సాంప్రదాయాలను తెలిపే ఈ సందేశాలు మీ ద్వారా మీ తరాని, రాబోయే తరానికి వ్యాప్తి కావాలని కోరుకుంటున్నాం.

Happy Kanuma Telugu Wishes

Kanuma Quotes:  కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ. శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ. మనలోని మంచితనాన్ని వెలిగించే దినం కనుమ. అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ. మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!

కనుమ శుభాకాంక్షలు | File Photo

Kanuma Quotes: మూన్నాళ్ల సంబరం.. ఏడాదంతా జ్ఞాపకం. స్వరం నిండిన సంగీతాల సంతోషాలు మనసొంతం. ఈ దినం, ఊరించే విందుతో పసందైన వేడుక చేసుకుందాం! కనుమ పండుగ శుభాకాంక్షలు.

కనుమ శుభాకాంక్షలు | File Photo

Kanuma Quotes: మట్టిలో పుట్టిన మేలిమి బంగారం, కష్టం చేతికి అంది వచ్చే తరుణం. నేలతల్లి,  పాడి పశువులు అందించిన వర ప్రసాదం. 'కనుమ' లా వడ్డించింది పరమాన్నం. కనుమ పండగ శుభాకాంక్షలు!

కనుమ శుభాకాంక్షలు | File Photo

Kanuma Quotes: రోకల్లు దంచే ధాన్యాలు, మనసుల్ని నింపే మాన్యాలు. రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన మన పాడి-పశువులు.. మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి ఇలాంటి వేడుకలు. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు!

కనుమ శుభాకాంక్షలు | File Photo

Kanuma Quotes:  రైతులే రాజుగా, రాతలే మార్చే పండుగ. పంట చేలు కోతలతో ఇచ్చే కానుక. మంచి తరుణాలకు కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ,  ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుక. కనుమ పండుగ శుభాకాంక్షలు!

ఈ సంక్రాంతి పండగ ఆనందాలు ఎప్పటికీ నిలవాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున కనుమ శుభాకాంక్షలు